The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.
Red Hat Enterprise Linux 6.4 నందు అభివృద్ది చేసిన మెరుగుదలలు మరియు చేరికల గురించి విడుదల నోట్స్ అధిక స్థాయిలో వివరణను అందించును. Red Hat Enterprise Linux కు 6.4 నవీకరణ పైగల అన్ని మార్పులపై విశదీకృత పత్రికీకరణ కొరకు, సాంకేతిక నోట్స్.. చూడండి.
Red Hat Enterprise Linux చిన్న విడుదలలు అనునవి స్వతంత్ర విస్తరింపు, రక్షణ మరియు బగ్ పరిష్కారాల సమాహారం. Red Hat Enterprise Linux 6.4 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 6 ఆపరేటింగ్ వ్యవస్థ మరియు దాని తోటి అనువర్తనములకు యీ చిన్న విడుదల నందు జరిగిన ముఖ్య మార్పులను పత్రకీకరణ చేయును. ఈ చిన్న విడుదల నందలి మార్పులు (అనగా, బగ్ పరిష్కారాలు, విస్తరింపులు, మరియు కనుగొన్న తెలిసిన సమస్యలు)పై విశదీకృత నోట్స్ సాంకేతిక నోట్స్ వద్ద అందుబాటులో వున్నాయి. సాంకేతిక నోట్స్ పత్రము అనునది ప్రస్తుతం అందుబాటులోవున్న ముందస్తు సాంకేతిక దర్శనాల జాబితాను వాటి ప్యాకేజీలతో సహా కలిగివుంది.
ముఖ్యమైన
ఆన్‌లైన్ Red Hat Enterprise Linux 6.4 విడుదల నోట్స్, ఆన్‌లైన్ నందు ఇచట వుంది, ఖచ్చితంగా, తాజా వర్షన్‌గా పరిగణించవలెను. విడుదల గురించి ప్రశ్నలు గల వినియోగదారులు వారి Red Hat Enterprise Linux వర్షన్ కొరకు ఆన్‌లైన్ విడుదల మరియు సాంకేతిక నోట్స్ సంప్రదించమని సూచించడమైంది.
Red Hat Enterprise Linux 6.4 సంస్థాపించుటకు కిక్‌స్టార్ట్ ఫైలును వుపయోగించునప్పుడు, కొత్త fcoe కిక్‌స్టార్ట్ ఐచ్చికంతో మీరు యే Fibre Channel over Ethernet (FCoE) పరికరాలు Enhanced Disk Drive (EDD) సేవలతో కనుగొన్న వాటికి అదనంగా క్రియాశీలం చేయాలో తెలుపవచ్చు. మరింత సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 సంస్థాపనా మార్గదర్శని నందలి Kickstart Options విభాగము చూడండి.
VLAN నందు సంస్థాపన
Red Hat Enterprise Linux 6.4 నందు, vlanid= బూట్ ఐచ్చికం మరియు --vlanid= కిక్‌స్టార్ట్ ఐచ్చికం మిమ్ములను వర్చ్యువల్ LAN ID (802.1q tag) ను ఫలానా నెట్వర్కు పరికరంకు అమర్చుటకు అనుమతించును. ఈ ఐచ్చికాలలో యేదో వొకటి తెలుపుట ద్వారా, వ్యవస్థ యొక్క సంస్థాపన VLAN నందు జరుగును.
బాండింగ్ ఆకృతీకరణ
bond బూట్ ఐచ్చికం మరియు --bondslaves మరియు --bondopts కిక్‌స్టార్ట్ ఐచ్చికాలు యిప్పుడు బాండింగ్‌ను సంస్థాపనా కార్యక్రమమునందు భాగముగా ఆకృతీకరించుటకు వుపయోగించవచ్చు. బాండింగ్‌ను యెలా ఆకృతీకరించాలో మరింత సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 సంస్థాపనా మార్గదర్శని కింది భాగాలు చూడండి: విభాగము కిక్‌స్టార్ట్ ఐచ్చికాలు మరియు అధ్యాయం బూట్ ఐచ్చికాలు.
Chapter 2. కెర్నల్
ఫైబర్ చానల్ ప్రొటోకాల్: ఎండ్-టు-ఎండ్ డాటా స్థిరత్వ పరిశీలన
End-To-End (E2E) డాటా స్థిరత్వం కొరకు విస్తరిత T10 DIF SCSI ప్రమాణము నందు భాగమైన zFCP-specific వృద్దిపరచుటచే హోస్టు యెడాప్టర్ మరియు నిల్వ సేవిక మధ్యని డాటా సమైఖ్యత Red Hat Enterprise Linux 6.4 నందు మెరుగుపరచబడెను.
IBM System z కొరకు ఫ్లాష్ యెక్సుప్రెస్ తోడ్పాటు
IBM System z కొరకు స్టోరేజ్-క్లాస్ మెమొరీ (SCM) డాటా నిల్వ పరికాల క్లాస్ అది నిల్వ మరియు మెమొరీ యొక్క లక్షణాలను కలుపును. System z కొరకు SCM యిప్పుడు ఫ్లాష్ యెక్సుప్రెస్ మెమొరీకు తోడ్పాటునిచ్చును. SCM యింక్రిమెంట్స్ ఎక్సెటెండెడ్ ఎసింక్రొనస్ డాటా మూవర్ (EADM) వుపచానళ్ళ ద్వారా యాక్సెస్ కాగలవు. ప్రతి యింక్రిమెంట్ బ్లాక్ పరికరంచే ప్రస్పుటించబడును. తాత్కాలిక నిల్వ కొరకు యీ విశేషణం పేజింగ్ రేట్‌ను మరియు యాక్సెస్ పనితనంను మెరుగుపరచును, వుదాహరణకు డాటా వేర్‌హౌసింగ్ కొరకు.
Open vSwitch కెర్నల్ మాడ్యూల్
Red Hat యొక్క లేయర్డ్ వుత్పత్తి ఆఫరింగ్స్ కొరకు యెనేబులర్ వలె Open vSwitch కెర్నల్ మాడ్యూల్‌ను Red Hat Enterprise Linux 6.4 చేర్చును. తోటి వాడుకరి స్పేస్ సౌలభ్యాలు కలిగివుండే వుత్పత్తులతో మాత్రమే Open vSwitch తోడ్పాటునిచ్చును. కావలసిన వాడుకరి స్పేస్ సౌలభ్యాలు లేకుండా, ఫంక్షన్ కాదని మరియు వినియోగం కొరకు చేతనం చేయలేమని గమనించండి. మరింత సమాచారం కొరకు, కింది సమాచార నిధి వ్యాసమును సందర్శించండి: https://access.redhat.com/knowledge/articles/270223.
బూటెడ్ వ్యవస్థ మరియు డంప్‌డ్ వ్యవస్థ పోలిక
ఇమేజ్ మైగ్రేషన్ ద్వారా వచ్చే మార్పులను సమర్ధవంతంగా విశ్లేషించుటకు యీ విశేషణం మిమ్ములను బూటెడ్ వ్యవస్థను డంప్‌డ్ వ్యవస్థతో పోల్చుటకు అనుమతించును. అతిథిని గుర్తించుటకు, stsi మరియు stfle డాటా వుపయోగించబడును. కొత్త ఫంక్షన్, lgr_info_log() ప్రస్తుత డాటా (lgr_info_cur) ను ఆఖరిగా రికార్డు అయిన (lgr_info_last) డాటాతో పోల్చును.
Perf సాధనం నవీకరించబడెను
perf సాధనం అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.6-rc7తో నవీకరించబడెను, అది పెద్ద సంఖ్యలో బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించును. కిందివి గుర్తించదగిన విస్తరింపులు:
Kprobe ఘటనల తోడ్పాటు జతచేయబడెను.
కొత్త perf ఘటన కమాండ్ లైన్ సిన్టాక్స్ యింజన్ చేర్చబడెను, అది కర్లీ బ్రాకెట్స్ ({ మరియు }) ను ఘటనా సమూహాల నిర్వచనం కొరకు వుపయోగించుటకు అనుమతించును, ఉదాహరణకు: {cycles,cache-misses}.
perf ఎన్నోటేట్ అన్వేషణి విస్తరించబడెను నావిగేషన్‌ను ASM కాల్స్ మరియు జంప్స్ ద్వారా అనుమతించుటకు.
కొత్త --uid కమాండ్ లైన్ ఐచ్చికంతో వొక్కో-వాడుకరి దర్శనంను అందించుటకు perf సాధనం నవీకరించబడెను. ఉపయోగించినప్పుడు, perf తెలిపిన వాడుకరికి మాత్రమే కర్తవ్యాలను చూపును.
perf సాధనం యిప్పుడు వివిధ స్వయంచాలక పరిశీలనలను విస్తారంగా అందించును.
Uncore PMU తోడ్పాటు
Intel Xeon Processor X55xx మరియు Intel Xeon Processor X56xx ప్రోసెసర్ల కొరకు పర్ఫ్ యీవెంట్ వుపవ్యవస్థకు Red Hat Enterprise Linux 6.4 తో వచ్చు కెర్నల్ "uncore" Performance Monitoring Unit (PMU) తోడ్పాటును జతచేయును. "uncore" అనునది బహుళ ప్రోసెసర్ కోర్సుతో పంచుకొను ఫిజికల్ ప్రోసెసర్ ప్యాకేజీ నందలి వుపవ్యవస్థలను రిఫర్ చేయును, వుదాహరణకు L3 క్యాచీ. uncore PMU తోడ్పాటుతో, పనితనం డాటా అనునది ప్యాకేజీ స్థాయిలో సులువుగా సేకరించవచ్చు.
perf ద్వారా డిబగ్గింగ్ అనుమతించుటకు PMU ఘటనల పార్శింగ్ చేతనం చేయబడెను.
తగ్గించిన memcg మెమొరీ వోవర్‌హెడ్
మెమొరీ నియంత్రణ సమూహాలు వాటి స్వంత లీస్ట్ రీసెంట్లీ యూజ్‌డ్ (LRU) జాబితాను నిర్వహించును, వుదాహరణకు, మెమొరీ తిరిగిపొందుటకు. ఈ జాబితా గ్లోబల్ పర్-జోన్ LRU జాబితా పైన వుంది. Red Hat Enterprise Linux 6.4 నందు, గ్లోబల్ పర్-జోన్ LRU జాబితాను అచేతనం చేసి మరియు బదులుగా వాటి వినియోగదారులను పర్-మెమొరీ cgroup జాబితాలపై ఆపరేట్ చేయుటకు మార్చుట ద్వారా memcg కొరకు మెమొరీ వోవర్‌హెడ్ తగ్గించబడును.
మెమొరీ రిక్లైమ్ మరియు కాంపాక్షన్
హై-ఆర్డర్ యెలోకేషన్ అభ్యర్ధనలు లేదా తక్కువ మెమొరీ వత్తిడి కొరకు Red Hat Enterprise Linux 6.4 తో అందించిన కెర్నల్ రిక్లైమ్ మరియు కాంపాక్షన్ వుపయోగించును.
ట్రాన్సాక్షన్ యెగ్జిక్యూషన్ సౌలభ్యం మరియు రన్‌టైమ్ యిన్‌స్ట్రుమెంటేషన్ సౌలభ్యం యొక్క తోడ్పాటు
లైనక్స్ కెర్నల్ నందలి Transactional-Execution సౌలభ్యం (IBM zEnterprise EC12 తో అందుబాటులోవుంది) అనునది పనితనంపై ప్రభావంచూపే సాఫ్టువేర్ లాకింగ్ వోవర్‌హెడ్ తోలగించుటకు సహాయబడును మరియు మెరుగైన స్కేలబిలిటి మరియు డ్రైవర్ హైయ్యర్ ట్రాన్సాక్షన్ త్రౌపుట్‌కు సమాంతరతను అదించును. Runtime Instrumentation సౌలభ్యం (IBM zEnterprise EC12 తో అందుబాటులో వున్నది) తోడ్పాటు అనునది మెరుగైన విశ్లేషణ కొరకు మరియు IBM JVM చేత జనియింపచేయబడిన కోడ్ ఆప్టిమైజేషన్ కొరకు ప్రొఫైల్ ప్రోగ్రామ్ కోడ్‌కు అదునాతన మెకానిజం అందించును.
ఫెయిల్-వోపెన్ రీతి
Red Hat Enterprise Linux 6.4 అనునది నెట్‌ఫిల్టర్ యొక్క NFQUEUE లక్ష్యం వుపయోగించునప్పుడు కొత్త ఫెయిల్-వోపెన్ రీతి కొరకు తోడ్పాటును జతచేయును. ఈ రీతి వాడుకరులను పాకెట్ తనిఖీను తాత్కాలికంగా అచేతనం చేయుటకు మరియు భారీ నెట్వర్కు రద్దీనందు అనుసంధానతను నిర్వహించుటకు అనుమతించును.
IBM System z కొరకు కెడంప్ మరియు kexec కెర్నల్ డంపింగ్ మెకానిజం పూర్తిగా తోడ్పాటునిచ్చును
Red Hat Enterprise Linux 6.4 నందు, kdump/kexec కెర్నల్ డంపింగ్ మెకానిజం అనునది IBM System z వ్యవస్థల కొరకు పూర్తి తోడ్పాటు విశేషణంవలె చేతనంచేయబడెను. ఆటో-రిజర్వుడ్ త్రెష్‌హోల్డ్ అనునది 4 GB వద్ద అమర్చబడెను; అందువలన, 4 GB మెమొరీ కన్నా యెక్కువ మెమొరీవున్న యే IBM System z వ్యవస్థైనా kdump/kexec మెకానిజం చేతనంగా కలిగివుంటుంది.
సరిపోవు మెమొరీ తప్పక అందుబాటులో వుండాలి యెంచేతంటే కెడంప్ దాదాపు 128 MB ను అప్రమేయంగా కలిగివుంటుంది. Red Hat Enterprise Linux 6.4 కు నవీకరణ జరుపునప్పుడు యిది చాలా ముఖ్యం. వ్యవస్థ కుప్పకూలినప్పుడు డంప్‌ను నిల్వవుంచుటకు సరిపోవు డిస్కు జాగాకూడా అందుబాటులో వుండాలి.
మీరు /etc/kdump.conf, system-config-kdump, లేదా firstboot ద్వారా కెడంప్‌ను ఆకృతీకరించవచ్చు.
KVM కొరకు TSC డెడ్‌లైన్ తోడ్పాటు
APIC (LAPIC) టైమర్ నందు TSC డెడ్‌లైన్ టైమర్ కొత్త రీతి, అది TSC డెడ్‌లైన్ ఆధారంగా వన్-షాట్ టైమర్ యింటరప్ట్స్ జనియింపచేయును, ప్రస్తుత APIC క్లాక్ కౌంట్ యింటర్వల్ స్థానంలో. అది మరింత ఖచ్చితమైన టైమర్ యింటరప్ట్స్ (1టిక్ కన్నా తక్కువైన) ను అందించును OS షెడ్యూలర్ లాభంకొరకు. KVM యిప్పుడు యీ విశేషణం అతిథులకు ప్రచలితం చేయును.
స్థిరమైన పరికర నామకరణ
ఈ విశేషణం పరికర పేర్ల మాపింగ్‌ను (ఉదాహరణకు sda, sdb, మరియు యితరములు) మరియు స్థిరమైన పరికర పేర్లు (/dev/disk/by-*/ నందు అందించబడిన udev) కెర్నల్ సందేశాలకు నిల్వవుంచును. ఇది వాడుకరులను కెర్నల్ సందేశాలనుండి పరికరంను గుర్తించుటకు అనుమతించును. కెర్నల్ /dev/kmsg లాగ్, అది dmesg సందేశంతో ప్రదర్శించబడును, యిప్పుడు సింబాలిక్ లింకుల కొరకు సందేశాలను చూపును, ఏదైతే udev కెర్నల్ పరికరాల కొరకు సృష్టించెనో. ఈ సందేశాలు కింది ఫార్మాట్‌లో ప్రదర్శించబడును:
ఏ లాగ్ విశ్లేషకైనా యీ సందేశాలను ప్రదర్శించగలదు, అవి /var/log/messages నందు syslog ద్వారా దాయబడెను.
కొత్త linuxptp ప్యాకేజీ
linuxptp ప్యాకేజీ, Red Hat Enterprise Linux 6.4 నందు ముందస్తు సాంకేతిక దర్శనంలా చేర్చబడినది, లైనక్సు కొరకు IEEE standard 1588 అనుసరించి వృద్దిచేసిన Precision Time Protocol (PTP). ప్రమాణత యొక్క రోబస్ట్ యింప్లిమెంటేషన్ మరియు లైనక్స్ కెర్నల్ చేత అందించబడుతున్న నవీన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యింటర్ఫేసెస్ (API) వుపయోగించుట డ్యూయల్ డిజైన్ యొక్క లక్ష్యాలు. పాత APIల తోడ్పాటు మరియు యితర ప్లాట్‌ఫాంల తోడ్పాటు లక్ష్యంకాదు.
పారదర్శక హ్యూజ్‌పేజెస్ పత్రకీకరణ
కింది ఫైలుకు పారదర్శక హ్యూజ్‌పేజస్ పత్రకీకరణ జతచేయబడెను:
Red Hat Enterprise Linux 6.4 నందు, /usr/share/doc/kexec-tools-2.0.0/kexec-kdump-howto.txt ఫైలు అనునది “Dump Target support status” విభాగము కిందన తోడ్పాటునిచ్చు, తోడ్పాటులేని, మరియు తెలియని డంప్ లక్ష్యాల జాబితాను యిచ్చును.
Chapter 3. పరికర డ్రైవర్లు
నిల్వ డ్రైవర్లు
హార్డువేర్ లేదా మైక్రోకోడ్ ద్వారా గుర్తించబడలేని పాత్ ఆకృతీకరణ దోషాలను గుర్తించుటకు డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైజెస్ (DASD) పరికర డ్రైవర్లు నవీకరించబడెను. వాటిని గుర్తించన తరువాత, పరికర డ్రైవర్ అటువంటి పాత్‌లను వుపయోగించదు. ఈ విశేషణంతో, వుదాహరణకు, DASD పరికర డ్రైవర్ అనునది ఫలానా వుపఛానల్‌కు అనుబందించి వేరే నిల్వ సేవికలకు పోవు పాత్‌లను గుర్తించును.
System z Fibre Channel Protocol (FCP) ఎడాప్టర్ కార్డ్ యొక్క విస్తరిత రీతికు తోడ్పాటునిచ్చే డాటా ఆకృతులను మరియు దోష సంభాలనను జతచేయుటకు zfcp పరికర డ్రైవర్ నవీకరించబడెను. ఈ రీతినందు, ఎడాప్టర్ కార్డు పైని మెమొరీ పెద్ద మరియు నిదానమైన I/O అభ్యర్ధనలచే నిరోధించబడినప్పుడు ఎడాప్టర్ డాటాను నేరుగా మెమొరీనుండి SAN(డాటా రౌటింగ్)కు పంపును.
Emulex ఫైబర్-చానల్ హోస్ట్ బస్ యెడాప్టర్స్ కొరకు lpfc డ్రైవర్ వర్షన్ 8.3.5.82.1p కు నవీకరించబడెను.
QLogic Fibre Channel HBAs కొరకు qla2xxx డ్రైవర్ వర్షన్ 8.04.00.04.06.4-k కు నవీకరించబడెను, యిది QLogic's 83XX కన్వర్జడ్ నెట్వర్క్ యెడాప్టర్ (CNA)కు, QLogic ఎడాప్టర్సుకు 16 GBps FC తోడ్పాటుకు, మరియు HP ProLiant సేవికల కొరకు కొత్త ఫాం ఫాక్టర్ CNA కు తోడ్పాటునిచ్చును.
qla4xxxx డ్రైవర్ వర్షన్ v5.03.00.00.06.04-k0 కు నవీకరించబడెను, ఇది change_queue_depth API తోడ్పాటు జతచేయును, బగ్‌లు పరిష్కరించును, మరియు వివిధ విస్తరింపులను యిస్తోంది.
QLogic 4Gbps fibre channel HBA కొరకు ql2400-firmware వర్షన్ 5.08.00 కు నవీకరించబడెను.
QLogic 4Gbps fibre channel HBA కొరకు ql2500-firmware వర్షన్ 5.08.00 కు నవీకరించబడెను.
IBM Power Linux RAID SCSI HBAs కొరకు ipr డ్రైవర్ వర్షన్ 2.5.4 కు నవీకరించబడెను, యిది Power7 6Gb SAS యెడాప్టర్సుకు తోడ్పాటునిచ్చును మరియు SAS VRAID సామర్థ్యంను యీ యెడాప్టర్సుపై చేతనంచేయును.
HP Smart Array Generation 8 family నియంత్రికలకు PCI-IDలు జతచేయుటకు hpsa డ్రైవర్ వర్షన్ 2.0.2-4-RH1 కు నవీకరించబడెను.
Broadcom NetXtreme II iSCSI కొరకు bnx2i డ్రైవర్ సాధారణ హార్డువేర్ తోడ్పాటు చేతనములతో వర్షన్ 2.7.2.2 కు నవీకరించబడెను.
Broadcom పరికరాలపై iSCSI మరియు FCoE బూట్ తోడ్పాటు యిప్పుడు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటు నివ్వబడును. ఈ రెండు విశేషణాలు bnx2i మరియు bnx2fc Broadcom డ్రైవర్లచే అందించబడును.
Broadcom Netxtreme II 57712 చిప్ కొరకు bnx2fc డ్రైవర్ వర్షన్ 1.0.12 కు నవీకరించబడెను.
Broadcom పరికరాలపై iSCSI మరియు FCoE బూట్ తోడ్పాటు యిప్పుడు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటు నివ్వబడును. ఈ రెండు విశేషణాలు bnx2i మరియు bnx2fc Broadcom డ్రైవర్లచే అందించబడును.
mpt2sas డ్రైవర్ వర్షన్ 101.00.00 కు నవీకరించబడెను, యిది Linux BSG డ్రైవర్‌కు మల్టీ-సెగ్మెంట్ రీతి తొడ్పాటును జతచేయును.
Brocade bfa Fibre Channel మరియు FCoE డ్రైవర్ వర్షన్ 3.0.23.0 కు నవీకరించబడెను అది Brocade 1860 16Gbps Fibre Channel యెడాప్టర్ తోడ్పాటు చేర్చును, Dell PowerEdge 12th జనరేషన్ సేవికలకు కొత్త హార్డువేర్ తోడ్పాటు చేర్చును, మరియు issue_lip తోడ్పాటు యిచ్చును. bfa ఫర్మువేర్ వర్షన్ 3.0.3.1 కు నవీకరించబడెను.
ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరాల కొరకు be2iscsi డ్రైవర్ వర్షన్ 4.4.58.0rకు నవీకరించబడెనుiSCSI netlink VLAN తోడ్పాటు జతచేయుటకు.
కింది విస్తరింపులతో TrueScale HCAలు సరికొత్త వర్షన్‌ఖు కింది విస్తరింపులతో నవీకరించబడెను:
విస్తరిత NUMA అవగాహన
Performance Scale Messaging (PSM) ఫాబ్రిక్స్ కొరకు Congestion Control Agent (CCA)
PSM ఫాబ్రిక్స్ కొరకు డ్యూయల్ రైల్
పనితనపు విస్తరింపులు మరియు బగ్ పరిష్కారాలు
కింది డ్రైవర్లు నవీకరించబడెను మరియు సరికొత్త అప్‌స్ట్రీమ్ విశేషణాలను మరియు బగ్ పరిష్కారాలను చేర్చెను: ahci, md/bitmap, raid0, raid1, raid10, మరియు raid456.
నెట్వర్కు పరికరాలు
NetXen Multi port (1/10) Gigabit Network కొరకు netxen_nic డ్రైవర్ వర్షన్ 4.0.80కు నవీకరించబడెను, అది miniDIMM తోడ్పాటును జతచేయును. netxen_nic ఫర్మువేర్ వర్షన్ 4.0.588కు నవీకరించబడెను.
Broadcom 57800/57810/57811/57840 చిప్స్ తోడ్పాటుకు అదేవిదంగా బగ్ పరిష్కారాల కొరకు మరియు Broadcom 57710/57711/57712 చిప్స్ నవీకృత ఫర్మువేర్ కొరకు bnx2x డ్రైవర్ వర్షన్ 1.72.51-0 కు నవీకరించబడెను. ఈ నవీకరణ కింది విస్తరింపులను కూడా కలిగివుంది:
Broadcom 57712/578xx చిప్సుపై ఈథర్నెట్ (DCB/FCOE) నందు iSCSI ఆఫ్‌లోడ్ మరియు డాటా సెంటర్ బ్రిడ్జింగ్/ఫైబర్ చానల్ తోడ్పాటు. Broadcom 57840 చిప్ అనునది 4x10G ఆకృతీకరణనందు మాత్రమే తోడ్పాటునివ్వబడును మరియు iSCSI ఆఫ్‌లోడ్ మరియు FCoE తోడ్పాటునీయదు. భవిష్య విడుదలలు అదనపు ఆకృతీకరణలను మరియు iSCSI ఆఫ్‌లోడ్ మరియు FCoE తోడ్పాటునిచ్చును.
అదనపు భౌతిక లేయర్ తోడ్పాటు, Energy Efficient Ethernet (EEE) తో కలుపుకొని.
iSCSI offload విస్తరింపులు
OEM-specific విశేషణాలు
ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరాల కొరకు be2net డ్రైవర్ వర్షన్ 4.4.31.0r కు నవీకరించబడెను RDMA over Converged Ethernet (RoCE) తోడ్పాటు జతచేయుటకు.
అదనంగా, Emulex be2net డ్రైవర్ యొక్క SR-IOV ఫంక్షనాలిటీ యిప్పుడు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటునిచ్చును. BE3-based హార్డువేర్ యొక్క అన్ని Emulex-branded మరియు OEM వేరియంట్స్ పై SR-IOV నడుచును, వీటన్నిటికీ be2net డ్రైవర్ సాఫ్టువేర్ అవసరం.
సరికొత్త హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాలను చేర్చుటకు ixgbevf డ్రైవర్ వర్షన్ 2.6.0-k కు నవీకరించబడెను.
నెట్వర్కు పరికరాల Chelsio T3 Family కొరకు cxgb3 డ్రైవర్ వర్షన్ 1.1.5-ko కు నవీకరించబడెను.
SR-IOV with Data Center Bridging (DCB) లేదా Receive-Side Scaling (RSS), PTP ముందస్తు సాంకేతిక దర్శనం తోడ్పాటుకు, సరికొత్త హార్డువేర్ తోడ్పాటుకు, విస్తరింపులకు, మరియు బగ్ పరిష్కారాలకు తోడ్పాటునిచ్చుటకు Intel 10 Gigabit PCI Express నెట్వర్కు పరికరాల ixgbe డ్రైవర్ వర్షన్ 3.9.15-kకు నవీకరించబడెను.
iw_cxgb3 డ్రైవర్ నవీకరించబడెను.
iw_cxgb4 డ్రైవర్ నవీకరించబడెను.
సరికొత్త హార్డువేర్ తోడ్పాటును, విశేషణాలను, మరియు చాలా బగ్ పరిష్కారాలను అందించుటకుIntel PRO/1000 నెట్వర్కు పరికరాల e1000e డ్రైవర్ నవీకరించబడెను.
enic డ్రైవర్ అనునది Cisco 10G ఈథర్నెట్ పరికరాల కొరకు వర్షన్ 2.1.1.39 కు నవీకరించబడెను.
సరికొత్త హార్డువేర్ తోడ్పాటును జతచేయుటకు Intel Gigabit Ethernet Adapters కొరకు igb డ్రైవర్ వర్షన్ 4.0.1 కు నవీకరించబడెను. ఇంకా, ముందస్తు సాంకేతిక దర్శనంవలె igb డ్రైవర్‌కు PTP తోడ్పాటు కూడా జతచేయబడెను.
Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరాల కొరకు tg3 డ్రైవర్ వర్షన్ 3.124కు నవీకరించబడెను సరికొత్త హార్డువేర్ తోడ్పాటు నిచ్చుటకు. ఇంకా, ముందస్తు సాంకేతిక దర్శనంవలె tg3 డ్రైవర్‌కు PTP తోడ్పాటు జతచేయబడెను.
qlcnic డ్రైవర్ అనునది HP NC-Series QLogic 10 Gigabit సర్వర్ యెడాప్టర్స్ కొరకు వర్షన్ 5.0.29 కు నవీకరించబడెను.
Dell PowerEdge 12th జనరేషన్ సేవికలకు కొత్త హార్డువేర్ తోడ్పాటునిచ్చుటకు, మరియు non-Brocade Twinax కాపర్ కేబుల్స్ వినియోగం చేతనం చేయుటకు Brocade 10Gb PCIe ఈథర్నెట్ నియంత్రికల డ్రైవర్ కొరకు Brocade bna డ్రైవర్ వర్షన్ 3.0.23.0కు నవీకరించబడెను. bna ఫర్మువేర్ వర్షన్ 3.0.3.1కు నవీకరించబడెను.
కొత్త విశేషణాలను, బగ్ పరిష్కారాలను, కొత్త OEM ప్లాట్‌ఫాంస్ కొరకు తోడ్పాటును యిచ్చుటకు, Broadcom NetXtreme II cnic డ్రైవర్ వర్షన్2.5.13కు నవీకరించబడెను.
నానారకములైన డ్రైవర్లు
Intel యొక్క Xeon E5-XXX V2 శ్రేణి ప్రోసెసర్స్ కొరకు తోడ్పాటునిచ్చుటకు intel_idle cpuidle డ్రైవర్ నవీకరించబడెను.
CTL-460 Wacom Bamboo Pen, Wacom Intuos5 Tablet, మరియు Wacom Cintiq 22HD Pen ప్రదర్శనకు తోడ్పాటునిచ్చుటకు wacom డ్రైవర్ నవీకరించబడెను.
కొత్త హార్డువేర్‌కు తోడ్పాటునిచ్చుటకు మరియు చాలా బగ్ పరిష్కారముల కొరకు ALSA HDA ఆడియో డ్రైవర్ నవీకరించబడెను.
HAProxy వొక స్టాండ్-ఎలోన్, లేయర్ 7, అధిక-పనితనపు నెట్వర్కు లోడ్ బాలెన్సర్ TCP మరియు HTTP-ఆధారిత అనువర్తనముల కొరకు ఏవైతే వివిధ రకాల షెడ్యూలింగ్‌ను HTTP అభ్యర్ధనల విషయంపై ఆధారపడి జరుపునో. Red Hat Enterprise Linux 6.4 haproxy ప్యాకేజీను ముందస్తు సాంకేతిక దర్శనం వలె యిస్తోంది.
Chapter 5. ధృవీకరణ మరియు యింటరాపరబిలిటి
SSSD పూర్తి తోడ్పాటు విశేషణాలు
Red Hat Enterprise Linux 6.3 నందు ప్రవేశపెట్టిన చాలా విశేషణాలు యిప్పుడు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటు నీయబడుచున్నాయి. ప్రత్యేకించి:
SSH కీల కేంద్రీయ నిర్వహణకు తోడ్పాటు,
SELinux వాడుకరి మాపింగ్,
మరియు ఆటోమౌంట్ మాప్ క్యాచింగ్ కొరకు తోడ్పాటు.
కొత్త SSSD క్యాచీ నిల్వ రకం
Kerberos వర్షన్ 1.10 కొత్త క్యాచీ నిల్వరకమును జతచేసెను, DIR:, యిది Kerberos ను బహుళ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ (KDCs) కొరకు టికెట్ గ్రాంటింగ్ టికెట్స్ (TGTs) ను సమకాలీనంగా నిర్వహించుటకు అనుమతించును మరియు Kerberos-aware వనరులతో నెగోషియేట్ చేయునప్పుడు వాటిమద్యన స్వయంచాలక-యెంపికకు అనుమతించును. Red Hat Enterprise Linux 6.4 నందు, SSSD ద్వారా లాగింన్ అయ్యే వాడుకరుల కొరకు DIR: క్యాచీ యెంపికచేయుటకు SSSD విస్తరింపబడెను. ఈ విశేషణం ముందస్తు సాంకేతిక దర్శనంలా యీయబడింది.
Red Hat Enterprise Linux 6.4 నందు, ipa group-add-member ఆదేశం మిమ్ములను ఏక్టివ్ డైరెక్టరీ-బేస్‌డ్ డొమైన్స్ యొక్క సభ్యులను గుర్తింపు నిర్వహణ నందు external గా గుర్తుంచబడిన సమూహాలకు జతచేయుటకు అనుమతించును. డొమైన్- లేదా UPN-ఆధారిత సిన్టాక్స్ వుపయోగించి ఈ సభ్యులు వారి పేర్లతో తెలుపబడవచ్చు, వుదాహరణకు AD\UserName లేదా AD\GroupName, లేదా User@AD.Domain. ఈ రూపంలో తెలిపినప్పుడు, సభ్యులు వారి సెక్యూరిటీ ఐడెంటిఫైర్ (SID) విలువను పొందుటకు ఏక్టివ్ డైరెక్టరీ-ఆధారిత ట్రస్టెడ్ డొమైన్ల గ్లోబల్ కాటలాగ్ తో పరిశీలించబడుదురు.
ప్రత్యామ్నాయంగా, SID విలువను నేరుగా తెలుపవచ్చు. ఈ సందర్భములో, ipa group-add-member ఆదేశం అనునది SID విలువ యొక్క డొమైన్ భాగము ట్రస్టెడ్ ఏక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ నందలిది అవునోకాదో మాత్రమే పరిశీలించును. డొమైన్ నందు SID ప్రమాణతను నిర్థారించుటకు ప్రయత్నించదు.
SID విలువలను నేరుగా అందించుట కన్నా వాడుకరి లేదా సమూహ పేరు సిన్టాక్స్ వుపయోగించి బాహ్య సభ్యులను తెలుపుట సిఫార్సు చేయడమైంది.
గుర్తింపు నిర్వహణ వుపవ్యవస్థ ధృవీకరణపత్రాలు స్వయంచాలకంగా-పునరుద్దరించు
కొత్త ధృవీకరణపత్రం అధికారం యొక్క అప్రమేయ ప్రమాణ కాలం 10 సంవత్సరాలు. CA దాని వుపవ్యవస్థల (OCSP, audit log, మరియు యితర)కు చాలా ధృవీకరణపత్రాలను జారీచేయును. ఉపవ్యవస్థ ధృవీకరణపత్రాలు సాధారణంగా 2 సంవత్సరాలు చెల్లుతాయి. ధృవీకరణపత్రాల గడువుతీరితే, CA ప్రారంభంకాదు లేదా సరిగా పనిచేయదు. అందువలన, Red Hat Enterprise Linux 6.4 నందు, గుర్తింపు నిర్వహణ సేవికలు స్వయంచాలకంగా వాటి వుపవ్యవస్థలను పునరుద్ధరించుకోగలవు. ఉపవ్యవస్థల ధృవీకరణపత్రాలు certmonger చే పరిశీలించబడును, అది గడువుతీరిన ధృవీకరణపత్రాలను స్వయంచాలకంగా పునరుద్దరించును.
గుర్తింపు నిర్వహణ నందు నమోదైన క్లైంట్లపై OpenLDAP క్లైంట్ సాధనాల స్వయంచాలక ఆకృతీకరణ
Red Hat Enterprise Linux 6.4 నందు, OpenLDAP అనునది స్వయంచాలకంగా అప్రమేయ LDAP URI, a Base DN, మరియు a TLS ధృవీకరణపత్రంతో గుర్తింపు నిర్వహణ క్లైంట్ సంస్థాపననందు ఆకృతీకరించబడును. గుర్తింపు నిర్వహణ డైరెక్టరీ సేవికకు LDAP అన్వేషణలను జరుపునప్పుడు యిది మెరుగైన వాడుకరి అనుభూతినిచ్చును.
python-nss కొరకు PKCS#12 తోడ్పాటు
నెట్వర్కు సెక్టూరిటీ సర్వీసెస్ (NSS) మరియు నెట్‌స్కేప్ పోర్టబుల్ రన్‌టైమ్ (NSPR) కొరకు పైథాన్ బైండిగ్స్ అందించు, python-nss ప్యాకేజీ, PKCS #12 తోడ్పాటు జతచేయుటకు నవీకరించబడెను.
DNS కొరకు పూర్తి స్థిరమైన అన్వేషణ
Red Hat Enterprise Linux 6.4 నందలి LDAP అనునది రెండు జోన్లకు మరియు వాటి వనరుల రికార్డ్స్ కొరకు స్థిరమైన అన్వేషణను అందించును. స్థిరమైన అన్వేషణ అనునది bind-dyndb-ldap చొప్పింత తక్షణమే LDAP డాటాబేస్ నందలి అన్ని మార్పుల గురించి తెలియజెప్పునట్లు చేయును. పునరావృత పోలింగ్ వలన అవసరమయ్యే నెట్వర్కు బాండ్‌విడ్స్ వినియోగాన్ని కూడా యిది తగ్గించును.
కొత్త CLEANALLRUV ఆపరేషన్
డాటాబేస్ రెప్లికా అప్‌డేట్ వెక్టార్ (RUV) నందలి వాడికలేని మూలకాలు CLEANRUV ఆపరేషన్‌తో తొలగించవచ్చు, అది వాటిని ఒక సప్లైర్‌పై లేదా మాస్టర్‌పై తొలగించును. Red Hat Enterprise Linux 6.4 కొత్త CLEANALLRUV ఆపరేషన్ యిస్తోంది అది అన్ని రెప్లికాలనుండి వాడికలేని RUV డాటా తొలగించగలదు మరియు దీనిని ఒక సప్లైర్/మాస్టర్‌పై మాత్రమే నడుపాలి.
samba4 లైబ్రరీలు నవీకరించబడెను
samba4 లేబ్రరీలు (samba4-libs ప్యాకేజీతో అందించబడినవి) ఏక్టివ్ డైరెట్రీ (AD) డొమైన్లతో యింటరాపరబిలిటీను మెరుగుపరచుటకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌తో నవీకరించబడెను. AD కీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ (KDC) చే జారీచేయబడిన ప్రివిలైజ్ యాట్రిబ్యూట్ సర్టిఫికేట్ (PAC) పార్స్ చేయుటకు SSSD యిప్పుడు libndr-krb5pac లైబ్రరీ వుపయోగించును. అదనంగా, విండోస్ వ్యవస్థ నుండి ట్రస్ట్ నిర్థారణను అనుమతించుటకు లోకర్ సెక్యూరిటీ అథారిటీ (LSA) మరియు నెట్ లాగిన్ సర్వీసెస్‌కు వివిధ మెరుగుదలలు చేయబడెను. క్రాస్ రియాల్మ్ కేర్బరోస్ ట్రస్ట్ ఫంక్షనాలిటీ పై సమాచారం కొరకు, ఏదైతే samba4 ప్యాకేజీలపై ఆధారపడెనో, Section 5, “గుర్తింపు నిర్వహణ నందు క్రాస్ రియాల్మ్ కేర్బరోస్ ట్రస్ట్ ఫంక్షనాలిటీ” చూడండి.
Warning
మీరు Red Hat Enterprise Linux 6.3 నుండి Red Hat Enterprise Linux 6.4 కు నవీకరిస్తుంటే మరియు సాంబాను వుపయోగిస్తుంటే, నవీకరణనందు విభాదాలను తప్పించుటకు samba4 ప్యాకేజీను నిర్మూలించండి.
క్రాస్ రియాల్మ్ ట్రస్ట్ ఫంక్షనాలిటీ అనునది ముందస్తు సాంకేతిక దర్శనంలా పరిగణించడంవలన, ఎంపికైన samba4 మూలకాలు ముందస్తు సాంకేతిక దర్శనంలా పరిగణించడమైంది.ఏ సాంబా ప్యాకేజీలు ముందస్తు సాంకేతిక దర్శనంలా పరిగణించబడ్డాయో తెలుసుకొనుటకు, Table 5.1, “Samba4 ప్యాకేజీ తోడ్పాటు” చూడండి.
ప్యాకేజీ పేరు
6.4 నందు కొత్త ప్యాకేజీ?
తోడ్పాటు స్థితి
samba4-libs
కాదు
OpenChange చేత అవసరమైన ఫంక్షనాలిటీ తప్పించి, ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-pidl
కాదు
OpenChange చేత అవసరమైన ఫంక్షనాలిటీ తప్పించి, ముందస్తు సాంకేతిక దర్శనం
samba4
కాదు
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-client
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-common
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-python
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-winbind
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-dc
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-dc-libs
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-swat
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-test
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-winbind-clients
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
samba4-winbind-krb5-locator
అవును
ముందస్తు సాంకేతిక దర్శనం
Table 5.1. Samba4 ప్యాకేజీ తోడ్పాటు
గుర్తింపు నిర్వహణ నందు క్రాస్ రియాల్మ్ కేర్బరోస్ ట్రస్ట్ ఫంక్షనాలిటీ
గుర్తింపు నిర్వహణ ద్వారా అందించబడిన క్రాస్ రియాల్మ్ కేర్బరోస్ ట్రస్ట్ ఫంక్షనాలిటీ ముందస్తు సాంకేతిక దర్శనంలా జతచేయబడెను. ఈ విశేషణం అనునది గుర్తింపు నిర్వహణ మరియు ఏక్టివ్ డైరెక్టరీ డొమైన్ మధ్యన విశ్వసించదగ్గ సంభందం నెలకొల్పుటకు దోహదపడును.దీనర్దం AD డొమైన్ నుండి వాడుకరులు గుర్తింపు నిర్వహణ డొమైన్ నుండి వనరులను మరియు సేవలను వారి AD ఆనవాళ్ళతో యాక్సెస్ చేయగలుగుతారు. గుర్తింపు నిర్వహణ మరియు AD డొమైన్ నియంత్రికల మధ్యన యే డాటా సింక్రొనైజ్ అవ్వనక్కరలేదు.; AD వాడుకరి యెల్లప్పుడూ AD డొమైన్ నియంత్రికపై ధృవీకరించబడును మరియు సింక్రొనైజేషన్ అవసరం లేకుండానే వాడుకరుల సమాచారం చూడవచ్చు.
ఈ విశేషణం ఐచ్చిక ipa-server-trust-ad ప్యాకేజీతో అందించబడెను. ఈ ప్యాకేజీ అనునది samba4 నందు అందుబాటులో వున్న విశేషణములపై మాత్రమే ఆధారపడును. ఎంచేతంటే samba4-* ప్యాకేజీలు సంభందిత samba-* ప్యాకేజీలతో విభేదించును, ipa-server-trust-ad సంస్థాపించుటకు ముందుగా అన్ని samba-* ప్యాకేజీలు తొలగించాలి.
ipa-server-trust-ad సంస్థాపించినప్పుడు, గుర్తింపు నిర్వహణ ట్రస్ట్సును సంభాలించగలుగుటకు ipa-adtrust-install ఆదేశం తప్పకుండా అన్ని గుర్తింపు నిర్వహణ సేవికలపై మరియు రిప్లికాస్‌పై నడుపాలి. ఇది అవగానే ipa trust-add లేదా WebUI వుపయోగించి కమాండ్ లైన్‌పై విశ్వసనీయత నెలకొల్పవచ్చు. మరింత సమాచారం కొరకు, https://access.redhat.com/knowledge/docs/Red_Hat_Enterprise_Linux/ పై Identity Management Guide నందు Integrating with Active Directory Through Cross-Realm Kerberos Trusts విభాగం చూడండి.
389 డైరెక్టరీ సేవిక కొరకు Posix స్కీమా తోడ్పాటు
వాడుకరి మరియు సమూహ ప్రవేశాల కొరకు విండోస్ ఏక్టివ్ డైరెక్టరీ (AD) అనునది POSIX schema (RFC 2307 మరియు 2307bis) కు తోడ్పాటునిచ్చును. చాలా సందర్భాలలో, AD అనునది వాడుకరి మరియు సమూహపు డాటా యొక్క ధృవీకృత మూలంలా వుపయోగించబడెను, POSIX యాట్రిబ్యూట్లతో సహా. Red Hat Enterprise Linux 6.4 తో, డైరెక్టరీ సర్వర్ విండోస్ సింక్ యికపై యీ యాట్రిబ్యూట్లను విస్మరించదు. వాడుకరులు యిప్పుడు AD మరియు 389 డైరెక్టరీ సేవిక మధ్యన POSIX యాట్రిబ్యూట్లను విండోస్ సింక్‌తో సింక్రొనైజ్ చేయగలరు.
Note
డైరెక్టరీ సేవికకు కొత్త వాడుకరిని మరియు సమూహపు ప్రవేశాలను జతచేయునప్పుడు, POSIX యాట్రిబ్యూట్స్ AD కు సింక్ కాలేదు. AD కు కొత్త వాడుకరి మరియు సమూహ ప్రవేశాలను జతచేస్తే డైరెక్టరీ సేవికకు సింక్రొనైజ్ అగును, యాట్రిబ్యూట్లను సవరించితే రెండువైపులా సింక్రొనైజ్ అగును.
Chapter 6. రక్షణ
sudoers ప్రవేశాలనందలి లుకప్స్ నందు సరిజోడీలను అధికారికంగా పరిగణిస్తోంది
sudoers ప్రవేశాల కొరకు sudo సౌలభ్యం /etc/nsswitch.conf ఫైలు సంప్రదించగలదు మరియు వాటిని ఫైళ్ళ నందు లేదా LDAP వుపయోగించి చూడగలదు. గతంలో, sudoers ప్రవేశాల డాటాబేస్ నందు సరిజోడీ కనుగొనినా, లుకప్ ఆపరేషన్ యింకా యితర డాటాబేస్‌లనందు (ఫైళ్ళతో సహా) కొనసాగుతూవుండేది. Red Hat Enterprise Linux 6.4 నందు, sudoers ప్రవేశపు సరిజోడీ తరువాత సరిపోయే డాటాబేస్ తెలుపుటకు, /etc/nsswitch.conf ఫైలుకు వొక ఐచ్చికం జతచేయబడెను. ఇది యే యితర డాటాబేస్‌లనైనా ప్రశ్నించు అవసరాన్ని తొలగించినది; అలా, లార్జ్ యెన్విరాన్మెంట్స్ నందు sudoers ప్రవేశపు లుకప్స్ పనితనాన్ని మెరుగుపరిచెను. ఈ ప్రవర్తన అప్రమేయంగా చేతనం చేయబడివుండదు, డాటాబేస్ యెంపికతరువాత [SUCCESS=return] స్ట్రింగ్ జతచేసి ఆకృతీకరించాలి. డాటాబేస్ నందు సరిజోడీ కనుగొనగానే అది నేరుగా యీ స్ట్రింగ్ ముందుంచును, యింకా యే యితర డాటాబేస్‌లు ప్రశ్నించబడవు.
pam_cracklib కొరకు అదనపు సంకేతపద పరిశీలనలు
కొత్త సంకేతపదం బలాల బహుళ పరిశీలనలు జతచేయుటకు pam_cracklib మాడ్యూల్ నవీకరించబడెను:
కొన్ని ధృవీకరణ విధానాలు "abcd" లేదా "98765" వంటి వరుస పరంపర సంకేతపదాలను అనుమతించవు. ఈ నవీకరణనందు maxsequence ఐచ్చికం వుపయోగించి యిటువంటి వరుస పరంపర యొక్క గరిష్ట పొడవును పరిమితం చేసే సంభవంవుంది.
pam_cracklib మాడ్యూల్ యిప్పుడు కొత్త సంకేతపదం అనునది /etc/passwd ఫైలునందలి GECOS క్షేత్ర ఫాం ప్రవేశాలనుండి పదాలను కలిగివుందో లేదో పరిశీలించుటకు అనుమతించును. GECOS క్షేత్రం అనునది వాడుకరి యొక్క పూర్తి పేరు లేదా ఫోన్ నంబర్ వంటి, వాడుకరికి సంబందించిన అదనపు సమాచారం నిల్వవుంచుటకు వుపయోగించబడును, అది సంకేతపదం భేదించుటకు ప్రయత్నించే వారిచే వుపయోగించబడవచ్చు.
pam_cracklib మాడ్యూల్ యిప్పుడు maxrepeatclass ఐచ్చికం ద్వారా సంకేతపదంనందు వొకే తరగతికి (చిన్నఅక్షరం, పెద్దఅక్షరం, సంఖ్య మరియు ప్రత్యేక అక్షరాలు) చెందిన యెన్ని వరుస అక్షరాలు గరిష్టంగా అనుమతించాలో తెలుపవచ్చు.
pam_cracklib మాడ్యూల్ యిప్పుడు enforce_for_root ఐచ్చికంకు తోడ్పాటునిచ్చును, అది root ఖాతా కొరకు కొత్త సంకేతపదాలపై సంక్లిష్టత నిర్భందాలను వత్తిడిచేయును.
tmpfs పాలీయిన్‌స్టాన్షియేషన్ కొరకు పరిమాణ ఐచ్చికం
బహుళ tmpfs మౌంట్స్ గల వ్యవస్థపై, వాటిని వ్యవస్థ యొక్క మెమొరీ మొత్తం ఆక్రమించకుండా నియంత్రించుటకు వాటి పరిమాణంను పరిమితం చేయుట తప్పనిసరి. /etc/namespace.conf ఆకృతీకరణ ఫైలునందు mntopts=size=<size> ఐచ్చికం వుపయోగించి tmpfs పాలీయిన్‌స్టాన్షియేషన్ వుపయోగించునప్పుడు tmpfs ఫైల్ వ్యవస్థ మౌంట్ యొక్క గరిష్ట పరిమాణం తెలుపుటకు వాడుకరులను అనుమతించుటకు PAM నవీకరించబడెను.
క్రియాహీన ఖాతాలను లాక్‌చేస్తోంది
కొంతకాలం నుండి వుపయోగించని ఖాతాను లాక్ చేయుటకు కొన్ని ధృవీకరణ విధానాలు అవసరం. Red Hat Enterprise Linux 6.4 అనునది pam_lastlog మాడ్యూల్‌కు అదనపు ఫంక్షన్ యిచ్చును, అకృతీకరణ ద్వారా తెలిపిన రోజుల తరువాత ఖాతాలను లాక్ చేయుటకు యిది వాడుకరులను అనుమతించును.
libica కొరకు కొత్త రీతి ఆపరేషన్
IBM System z పైన IBM eServer Cryptographic Accelerator (ICA) హార్డువేర్ యాక్సెస్ చేయుటకు ఫంక్షన్స్ మరియు సౌలభ్యాలను కలిగివుండే, libica లైబ్రరీ, Cryptographic Function (CPACF) కొరకు సెంట్రల్ ప్రోసెసర్ యెసిస్ట్ నందు Message Security Assist Extension 4 సూచనల తోడ్పాటుకు కొత్త అల్గార్దెమ్ల వాడుకను అనుమతించుటకు నవీకరించబడెను. DES మరియు 3DES బ్లాక్ సైఫర్స్ కొరకు, కింది ఆపరేషన్ రీతులు యిప్పుడు తోడ్పాటునిచ్చును:
సైఫర్‌టెక్ట్స్ స్టీలింగ్‌తో సైఫర్ బ్లాక్ చైనింగ్ (CBC-CS)
సైఫర్-బేస్డ్ మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ (CMAC)
AES బ్లాక్ సైఫర్ కొరకు, కింది ఆపరేషన్ రీతులు తోడ్పాటునిచ్చును:
సైఫర్‌టెక్ట్స్ స్టీలింగ్‌తో సైఫర్ బ్లాక్ చైనింగ్ (CBC-CS)
సైఫర్ బ్లాక్ చైనింగ్ మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ (CCM) తో కౌంటర్
Galois/Counter (GCM)
కాంప్లెక్స్ క్రిప్టోగ్రఫిక్ అల్గార్దెమ్స్ యొక్క యీ ఏగ్జెలరేషన్ IBM System z మిషన్ల పనితనంను గుర్తించేవిధంగా మెరుగుపరచును.
System z కొరకు zlib కుచింపు లైబ్రరీ ఆప్టిమైజేషన్, మరియు తోడ్పాటు
zlib లైబ్రరీ, ఒక సాదారణ-ప్రయోజన నష్టంలేని డాటా కుచింపు లైబ్రరీ, IBM System z పైన కుచింపు పనితనం మెరుగుపరచుటకు నవీకరించబడెను.
ఫాల్‌బాక్ ఫైర్‌వాల్ ఆకృతీకరణ
అప్రమేయ ఆకృతీకరణలు ఆపాదించలేకపోతే iptables మరియు ip6tables సేవలు యిప్పుడు ఫాల్‌బాక్ ఫైర్‌వాల్ ఆకృతీకరణ అనుబందించు సామర్ధ్యమును యిచ్చుచున్నవి. /etc/sysconfig/iptables నుండి ఫైర్‌వాల్ నియమాలు ఆపాదించుట విఫలమైతే, ఫాల్‌బాక్ ఫైలు వుంటే అది ఆపాదించబడును. ఫాల్‌బాక్ ఫైలు పేరు /etc/sysconfig/iptables.fallback మరియు iptables-save ఫైలు రూపం వుపయోగించును (/etc/sysconfig/iptables వలె). ఫాల్‌బాక్ ఫైలు యొక్క అనువర్తనంకూడా విఫలమైతే, వేరే ఫాల్‌బాక్ వుండదు. ఫాల్‌బాక్ ఫైలు సృష్టించుటకు, ప్రామాణిక ఫైర్‌వాల్ ఆకృతీకరణ సాధనాలను వుపయోగించండి మరియు ఫైలును పేరుమార్చండి లేదా ఫాల్‌బాక్ ఫైలుకు నకలుతీయండి. అదే ప్రోసెస్‌ను ip6tables సేవ కొరకు వుపయోగించండి, “iptables” యొక్క అన్ని సంభవాలను మాత్రమే “ip6tables” తో పునఃస్థాపించుము.
Chapter 7. ఎన్‌టైటిల్‌మెంట్
స్ట్రింగ్ నవీకరణలు
Red Hat Enterprise Linux 6.4 నందు, చాలా స్ట్రింగ్స్ సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక నందు పేరుమార్చబడెను:
subscribe అనునది attach కు పేరుమార్చబడెను
auto-subscribe అనునది auto-attach కు పేరుమార్చబడెను
unsubscribe అనునది remove కు పేరుమార్చబడెను
consumer అనునది system కు లేదా unit కు పేరు మార్చబడెను
బహుళ యెన్టైటిల్మెంట్లను సబ్‌స్క్రైబ్‌చేయి లేదా అన్‌సబ్‌స్క్రైబ్‌చేయి
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక యిప్పుడు బహుళ యెన్టైటిల్మెంట్లను వాటి వరుస సంఖ్యలను వొకేసారి యిచ్చి సబ్‌స్క్రైబ్ (attach) లేదా అన్‌సబ్‌స్క్రైబ్ (remove) చేయగలదు.
క్రియాశీల కీలు GUI నందు తోడ్పాటునిచ్చును
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక గ్రాఫికల్ వాడుకరి యింటర్ఫేస్ యిప్పుడు మిమ్ములను వ్యవస్థను క్రియాశీల కీ వుపయోగించి నమోదుచేయుటకు అనుమతించును. క్రియాశీల కీలు వాడుకరులను వ్యవస్థ నమోదు కావడానికి ముందుగా సబ్‌స్క్రిప్షన్లను ఆకృతీకరించుటకు అనుమతించును.
బహిర్గత సేవికలకు వ్యతిరేకంగా నమోదుచేయుట
వ్యవస్థ యొక్క నమోదీకరణనందు దూరస్థ సేవికను యెంపికచేయుటకు తోడ్పాటు యిప్పుడు సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక నందు వుంది. సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక వాడుకరి యింటర్ఫేస్ అనునది నమోదగుటకు వొక URL ను యెంచుకొనే ఐచ్చికం యిచ్చును, పోర్టు మరియు ప్రిఫిక్సుతో, నమోదీకరణ కార్యక్రమమందు. అదనంగా, కమాండ్ లైన్ పైన నమోదగునప్పుడు, --serverurl ఐచ్చికాన్ని సేవిక నమోదీకరణ కొరకు వుపయోగించవచ్చు. మరింత సమాచారం కొరకు, Subscription Management Guide నందలి Registering, Unregistering, and Reregistering a System చూడండి.
GUI నందు వాడుక మార్పులు
వినియోగదారి స్పందనపై ఆధారపడి వివిధ మార్పులతో సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక GUI వృద్దిచేయబడెను.
virtio-SCSI(SCSI పైన KVM ఆధారిత వొక నిల్వ ఆకృతి) సామర్థ్యాలు జతకావడంతో KVM వర్చ్యులైజేషన్ నిల్వ స్టాక్ మెరుగైను. నేరుగా SCSI LUNలతో అనుసంధానమయ్యే సామర్థ్యను virtio-SCSI యిచ్చును మరియు virtio-blk తో పోల్చితే స్కేలబిలిటీను మెరుగుపరుచును. దాదాపు 25 పరికరాలను సంబాలించగలిగే virtio-blk తో పోల్చితే virtio-SCSI వందలకొద్ది పరికరాలను మరియు ఎగ్జాస్ట్ PCI స్లాట్స్ సంభాలించగలగడం దాని ప్రత్యేకత.
Virtio-SCSI అనునది యిప్పడు యీ సామర్థ్యంతో లక్ష్యపు పరికరం యొక్క విశేషణ సమితిని సంక్రమించుకోగల శక్తిగలది:
virtio-scsi నియంత్రకకి వొక వర్చ్యువల్ హార్డు డ్రైవ్ లేదా CD అనుబందించు,
QEMU scsi-block పరికరం ద్వారా భౌతిక SCSI పరికరంను అతిధేయ నుండి అతిథికి పంపు,
మరియు వొక్క అతిథికి వందలకొద్ది పరికరాల వినియోగంను అనుమతించును, virtio-blk యొక్క ~25-పరికరం పరిమితినుండి మెరుగుదల.
virtio-scsi అనునది Red Hat Enterprise Linux 6.3 నందు ముందస్తు సాంకేతిక దర్శనంవలె వచ్చింది మరియు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటునీయబడును. Windows అతిథులు (Windows XP తప్పించి) సరికొత్త virtio-win డ్రైవర్లతో తోడ్పాటునీయబడును.
Intel యొక్క తరువాతి-తరం కోర్ ప్రోసెసర్‌కు తోడ్పాటు
Intel యొక్క తరువాతి-తరం కోర్ ప్రోసెసర్ కొరకు Red Hat Enterprise Linux 6.4 qemu-kvmకు తోడ్పాటు జతచేసెను అలా KVM అతిథులు ఈ ప్రోసెసర్ అందించే కొత్త విశేషణాలను వుపయోగించగలవు, మరీ ముఖ్యమైనవి:Advanced Vector Extensions 2 (AVX2), Bit-Manipulation Instructions 1 (BMI1), Bit-Manipulation Instructions 2 (BMI2), Hardware Lock Elision (HLE), Restricted Transactional Memory (RTM), Process-Context Identifier (PCID), Invalidate Process-Context Identifier (INVPCID), Fused Multiply-Add (FMA), Big-Endian Move instruction (MOVBE), F Segment and G Segment BASE instruction (FSGSBASE), Supervisor Mode Execution Prevention (SMEP), Enhanced REP MOVSB/STOSB (ERMS).
AMD Opteron 4xxx శ్రేణి CPU తోడ్పాటు
AMD Opteron 4xxx శ్రేణి ప్రోసెసర్ యిప్పుడు qemu-kvm చేత తోడ్పాటునీయబడును. ఇది యీ ప్రోసెసర్ శ్రేణి అందించు కొత్త విశేషణాలను KVM అతిథులకు ప్రచలితమగునట్లు చేయును, అవి: F16C instruction set, Trailing Bit Manipulation, Bit-Manipulation Instructions 1 (BMI1) decimate ఫంక్షన్స్, మరియు Fused Multiply-Add (FMA) సూచన సమితి.
SPICE ద్వారా USB ఫార్వార్డింగ్ వుపయోగించి అతిథి లైవ్ మైగ్రేషన్
Red Hat Enterprise Linux 6.4 నందు,SPICE ద్వారా USB ఫార్వార్డింగ్ వుపయోగించి KVM అతిథుల లైవ్ మైగ్రేషన్‌కు తోడ్పాటునిచ్చును, యిది చేస్తునే అన్ని ఆకృతీకృత పరికరాలకు యిప్పటికే వున్న USB పరికర రీడైరెక్షన్ నిర్వహించును.
USB పరికరాలు వుపయోగించి అతిథుల లైవ్ మైగ్రేషన్
Red Hat Enterprise Linux 6.4 నందు, USB పరికరాలతో KVM అతిథుల లైవ్ మైగ్రేషన్‌కు తోడ్పాటునిచ్చును. కింది పరికరాలు తోడ్పాటునిచ్చును: Enhanced Host Controller Interface (EHCI) మరియు Universal Host Controller Interface (UHCI) లోకల్ పాస్‌త్రూ మరియు నిల్వ పరికరాలు, మైక్, కీబోర్డ్స్, హబ్స్, మరియు యితరముల వంటి ఎమ్యులేటెడ్ పరికరాలు.
QEMU అతిథి ఏజెంట్ నవీకరించబడెను
QEMU అతిథి ప్రతినిధి (qemu-guest-agent ప్యాకేజీ ద్వారా అందించబడినది) యిప్పుడు Red Hat Enterprise Linux 6.4 నందు పూర్తిగా తోడ్పాటునీయబడును. ఇది అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.1 కు నవీకరించబడెను, మరియు కింది గుర్తించదగిన విస్తరింపులను మరియు బగ్ పరిష్కారాలను చేర్చును:
guest-suspend-disk మరియు guest-suspend-ram ఆదేశాలు యిప్పుడు విండోస్ వ్యవస్థపైన RAM లేదా డిస్కును సస్పెండ్ చేయుటకు వుపయోగించవచ్చు.
లైనక్సునందు నెట్వర్కు యింటర్ఫేస్ సమాచారం పొందుటకు guest-network-get-interfaces ఆదేశం యిప్పుడు వుపయోగించవచ్చు.
ఫైల్ సిస్టమ్ ఫ్రీజ్ తోడ్పాటు మెరుగుదలలను మరియు పరిష్కారాలను యీ నవీకరణ అందించును.
ఈ నవీకరణనందు వివిధ పత్రకీకరణ పరిష్కారాలు మరియు చిన్నపాటి మెరుగుదలలు వున్నాయి.
Red Hat Enterprise Linux 6.3 మరియు పాతవి నడుపు అతిధేయలు మరియు అతిథిలు ప్రతి యింటరప్టునకు రెండు VM నిష్క్రమణలు (VM నుండి హైపర్విజర్‌కు కాంటెక్స్ట్ స్విచెస్) కావాలి: ఒకటి యింటరప్ట్ యెక్కించుటకు, మరియు యింకొకటి యింటరప్ట్ యొక్క ముగింపు సంకేతం యిచ్చుటకు. అతిధేయ మరియు అతిథి వ్యవస్థలు Red Hat Enterprise Linux 6.4 కు నవీకరించబడినప్పుడు, అవి పారావర్చ్యులైజ్డ్ యింటరప్ట్-ముగింపు విశేషణం కొరకు నెగోషియేట్ చేయగలవు మరియు వొక్కో యింటరప్టునకు వొక స్విచ్ మాత్రమే అవసరం. ఫలితంగా, Red Hat Enterprise Linux 6.4 లేదా కొత్తది అతిధేయకు లేదా అతిథికు వుపయోగించుట, యింటరప్ట్-యింటెన్సివ్ వర్కులోడ్సుకు బహిష్కరణల సంఖ్య సగానికి తగ్గించబడెను, వర్టియో నెట్వర్కు పరికరంతో లోనికివచ్చు నెట్వర్కు రద్దీ వంటిది. అటువంటి పనిభారములకు అతిధేయి CPU వినియోగంనందు గుర్తించదగిన తగ్గింపుకు కారణమగును. ఎడ్జ్ యింటరప్ట్స్ మాత్రమే విస్తరించబడినవని గమనించండి: ఉదాహరణకు e1000 నెట్వర్కింగ్ స్థాయీ యింటరప్ట్స్ వుపయోగించును మరియు మెరుగుపడలేదు.
ఆకృతీకరించగల సౌండ్ పాస్-త్రూ
అతిథి వ్యవస్థ నందు శబ్ద పరికరం యిప్పుడు వొక microphone లాగా లేదా speaker వలె గుర్తించబడును (line-in మరియు line-out గా గుర్తించబడుటకంటే). వాయీస్ రికార్డింగ్ మరియు ఆడియో కొరకు ఫలానా రకముల యిన్పుట్లను మాత్రమే అమోదించు అతిథి అనువర్తనములనందు యిప్పుడు శబ్ద పరికరాలు సరిగా పనిచేయగలవు.
8.2. Hyper-V
Microsoft Hyper-V డ్రైవర్స్, చేర్పు, మరియు అతిథి సంస్థాపనా తోడ్పాటు
ఇంటిగ్రేటెడ్ Red Hat Enterprise Linux అతిథి సంస్థాపన, మరియు Hyper-V పారా-వర్చ్యులైజ్డ్ పరికర తోడ్పాటు Red Hat Enterprise Linux 6.4 నందు Microsoft Hyper-V పై వాడుకరులను Red Hat Enterprise Linux 6.4ను అతిథి వలె Microsoft Hyper-V హైపర్విజర్స్ పై నడుపుటకు అనుమతించును. కింది Hyper-V డ్రైవర్స్ మరియు క్లాక్ సోర్స్ అనునవి Red Hat Enterprise Linux 6.4 తో అందించబడిన కెర్నల్‌కు జతచేయబడెను:
నెట్వర్కు డ్రైవర్ (hv_netvsc)
నిల్వ డ్రైవర్ (hv_storvsc)
HID-కంప్లైంట్ మౌస్ డ్రైవర్ (hid_hyperv)
VMbus డ్రైవర్ (hv_vmbus)
util డ్రైవర్ (hv_util)
ఒక IDE డిస్కు డ్రైవర్ (ata_piix)
ఒక క్లాక్ మూలం (i386, AMD64/Intel 64: hyperv_clocksource)
Red Hat Enterprise Linux 6.4 అనునది Hyper-V కు క్లాక్ మూలంవలె మరియు అతిథి Hyper-V Key-Value Pair (KVP) డెమోన్ వలె తోడ్పాటునిచ్చును, (hypervkvpd) యీ డెమోన్ ప్రాధమిక సమాచారంను, అతిథి ఐపి, FQDN, OS పేరు, OS విడుదల సంఖ్య వంటివి, VMbus ద్వారా అతిధేయకు యిచ్చును.
8.3. VMware ESX
VMware PV డ్రైవర్లు
VMware ESX నందు Red Hat Enterprise Linux 6.4 ను నడుపునప్పుడు నిరంతర అవుట్-ఆఫ్-ది-బాక్స్ అనుభూతిని అందించుటకు VMware పారా-వర్చ్యులైజ్డ్ డ్రైవర్లు నవీకరించబడెను. సంస్థాపనా కార్యక్రమమునందు డ్రైవర్లను జాబితా చేయుటకు అనకొండ సంస్థాపకి కూడా నవీకరించబడెను. కింది డ్రైవర్లు నవీకరించబడెను:
ఒక నెట్వర్కు డ్రైవర్ (vmxnet3)
ఒక నిల్వ డ్రైవర్ (vmw_pvscsi)
ఒక మెమొరీ బెలూనింగ్ డ్రైవర్ (vmware_balloon)
ఒక మౌస్ డ్రైవర్ (vmmouse_drv)
వీడియో డ్రైవర్ (vmware_drv)
Chapter 9. క్లస్టరింగ్
IBM iPDU ఫెన్స్ పరికరం కొరకు తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.4 అనునది IBM iPDU ఫెన్స్ పరికరం కొరకు తోడ్పాటు జతచేయును. ఈ ఫెన్స్ పరికరం యొక్క పారామితులపై మరింత సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 Cluster Administration మార్గదర్శని నందలి Fence Device Parameters ఎపెన్డిక్స్ చూడండి.
Eaton నెట్వర్కు పవర్ నియంత్రిక ఫెన్స్ పరికరం కొరకు తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.4 అనునది fence_eaton_snmpకు తోడ్పాటునిచ్చును, SNMP నెట్వర్కు పవర్ స్విచ్‌పై Eaton కొరకు ఫెన్స్ యేజెంట్.ఈ ఫెన్స్ యేజెంట్ యొక్క పారామితులపై మరింత సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 Cluster Administration మార్గదర్శని నందలి Fence Device Parameters ఎపెండిక్స్ చూడండి.
కొత్త keepalived Package
Red Hat Enterprise Linux 6.4 keepalived ప్యాకేజీను ముందస్తు సాంకేతిక దర్శనంగా విడుదల చేస్తోంది. keepalived ప్యాకేజీ అనునది లోడ్-బాలెన్సింగ్ మరియు హై-ఎవైలబిలిటీ కొరకు సరళమైన మరియు రోబస్ట్ సౌలభ్యాలను అందించును. లోడ్-బాలెన్సింగ్ ప్రేమ్‌వర్క్ అనునది లేయర్ 4 నెట్వర్కు లోడ్-బాలెన్సింగ్ అందించు పేరున్న మరియు విరివిగా వాడు లైనక్స్ వర్చ్యువల్ సర్వర్ కెర్నల్ మాడ్యూల్‌పై ఆధారపడును. keepalived డెమోన్ అనునది లోడ్-బాలెన్సుడ్ సర్వర్ పూల్స్ కొరకు హెల్త్ చెకర్స్ సమితిని వాటి స్థితి అనుసారం యింప్లిమెంట్ చేయును. keepalived డెమోన్ Virtual Router Redundancy Protocol (VRRP) కూడా యింప్లిమెంట్ చేయును, యిది రూటర్ లేదా డెరెక్టరీ ఫెయిల్‌వోవర్ హై ఎవైలబిలిటి పొందుటకు అనుమతించును.
వాచ్‌డాగ్ రికవరీ
fence_sanlock మరియు checkquorum.wdmd ఫెన్స్ యేజెంట్లు, Red Hat Enterprise Linux 6.4 నందు ముందస్తు సాంకేతిక దర్శనం వలె చేర్చబడెను, వాచ్‌డాగ్ పరికరం ద్వారా నోడ్ యొక్క రికవరీను ట్రిగ్గర్ చేయుటకు కొత్త సాంకేతికతను అందించును. ఈ ముందస్తు సాంకేతిక దర్శనం యెలా చేతనం చేయాలి అనేదానిపై ట్యుటోరియల్స్ https://fedorahosted.org/cluster/wiki/HomePage వద్ద అందుబాటులో వున్నాయి.
VMDK-ఆధారిత నిల్వ కొరకు తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.4 అనునది VMware's VMDK (Virtual Machine Disk) యిమేజ్ సాంకేతికతను మల్టీ-వ్రైటర్ ఐచ్చికంతో వుపయోగించు క్లస్టర్స్ కొరకు తోడ్పాటు జతచేయును. ఇది మిమ్ములను, వుదాహరణకు, VMDK-ఆధారిత నిల్వను మల్టీ-వ్రైటర్ ఐచ్చికంతో క్లస్టర్డ్ ఫైల్ వ్యవస్థలు GFS2 వంటి వాటి కొరకు వుపయోగించుటకు అనుమతించును.
Chapter 10. నిల్వ
సమాంతర NFS పూర్తిగా తోడ్పాటునీయబడును
సమాంతర NFS (pNFS) అనునది NFS v4.1 ప్రమాణం నందు భాగము అది క్లైంట్లను నిల్వ పరికరాలను నేరుగా మరియు సమాంతరంగా యాక్సెస్ చేయుటకు అనుమతించును. చాలా వుమ్మడి పనిభారముల కొరకు pNFS ఆకృతి అనునది స్కేలబిలిటీను మరియు NFS సేవికల పనితనంను మెరుగుపరచగలదు. Red Hat Enterprise Linux 6.4 నందు, pNFS పూర్తిగా తోడ్పాటునీయబడును.
pNFS 3 భిన్న నిల్వ ప్రొటోకాల్స్ లేదా లేవుట్స్ తోడ్పాటునిచ్చును: ఫైళ్ళు, ఆబ్జక్టులు మరియు బ్లాక్స్. Red Hat Enterprise Linux 6.4 NFS క్లైంట్ అనునది ఫైల్స్ లేఅవుట్ ప్రోటోకాల్ తోడ్పాటునిచ్చును.
ఈ ఫంక్షనాలిటీను చేతనం చేయుటకు pNFS-చేతన సేవికనుండి మౌంట్స్ పై కింది మౌంట్ ఐచ్చికాలలో వొకటి వుపయోగించుము: -o minorversion=1 లేదా -o v4.1.
సేవిక pNFS-చేతనమైనప్పుడు, nfs_layout_nfsv41_files కెర్నల్ మాడ్యూల్ స్వయంచాలకంగా మొదటి మౌంట్ పై లోడగును. ఈ మాడ్యూల్ లోడైందని నిర్థారించుటకు కింది ఆదేశం వుపయోగించుము:
ఒక ఆన్‌లైన్ డిస్కార్డ్ ఆపరేషన్ అనునది మౌంటైన ఫైల్ సిస్టమ్ డిస్కార్డ్స్ బ్లాక్స్ పైన జరుపబడెను అవి ఫైల్ సిస్టమ్‌చే వుపయోగించబడుటలేదు. ఆన్‌లైన్ డిస్కార్డ్ ఆపరేషన్లు యిప్పుడు XFS ఫైల్ సిస్టమ్స్ పైన తోడ్పాటునిచ్చును. మరింత సమాచారం కొరకు, Red Hat Enterprise Linux 6 Storage Administration Guide నందలి Discard Unused Blocks విభాగం చూడండి.
Micron PCIe SSD కొరకు LVM తోడ్పాటు
Red Hat Enterprise Linux 6.4 నందు, వాల్యూమ్ సమూహం నందు భాగముగా యేర్పరచగల Micron PCIe Solid State Drives (SSDs) పరికరాలకు LVM తోడ్పాటునిచ్చును.
-m మరియు -i ఆర్గుమెంట్లు యితర సెగ్మెంట్ రకములకు యెలా ప్రవర్తించునో అలానే ప్రవర్తించునని గమనించండి. అనగా, -i మొత్తం స్ట్రైప్స్ సంఖ్య మరియు -m (అదనపు) నకళ్ళ సంఖ్య (అనగా, -m 1 -i 2 2 స్ట్రైప్లను 2-way మిర్రర్లపైన యిచ్చును).
పరికర మాపర్ పరికరముల ద్వారా SCSI పర్‌సిస్టెంట్ రిజర్వేషన్లను అమర్చి నిర్వహించుము
గతంలో, మల్టీపాత్ పరికరాలపై పర్‌సిస్టెంట్ రిజర్వేషన్లను అమర్చుటకు, అన్ని పాత్ పరికరాలపైన దానిని అమర్చుట తప్పనిసరి. ఒకవేళ పాత్ పరికరం తరువాత జతచేయబడితే, రిజర్వేషన్లను మానవీయంగా పాత్‌కు జతచేయుట తప్పనిసరి. Red Hat Enterprise Linux 6.4 అనునది mpathpersist ఆదేశముతో పరికర మాపర్ పరికరముల ద్వారా SCSI పర్‌సిస్టెంట్ రిజర్వేషన్లను అమర్చి నిర్వహించే సామర్ధ్యంను జతచేయును. పాత్ పరికరాలు జతచేసినప్పుడు, పర్‌సిస్టెంట్ రిజర్వేషన్లు ఆ పరికరాలపై కూడా అమర్చబడును.
Chapter 11. కంపైలర్ మరియు సాధనములు
SystemTap వర్షన్ 1.8 కు నవీకరించబడెను
ఆపరేటింగ్ సిస్టమ్ (ప్రత్యేకించి, కెర్నల్) ను విశదీకృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షించుటకు SystemTap అనునది ట్రేసింగ్ మరియు ప్రోబింగ్ సాధనం. ఇది netstat, ps, top, మరియు iostat; వంటి సాధనములకు సమానమైన అవుట్‌పుట్ యిచ్చును. సేకరించిన సమాచారంకు మరిన్ని ఫిల్టరింగ్ మరియు విశ్లేషక ఐచ్చికాలను అందించుటకు SystemTap రూపొందించబడెను.
Red Hat Enterprise Linux 6.4 నందలి systemtap ప్యాకేజీ అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.8 కు నవీకరించబడెను, ఇది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించును:
uprobe మరియు kprobe సంభాలికలు (ప్రోసెస్, కెర్నల్, మాడ్యూల్) నందు DWARF వేరియబుల్స్ యాక్సెస్ చేయుటకు @var సిన్టాక్స్ యిప్పడుు ప్రత్యామ్నాయ లాంగ్వేజ్ సిన్టాక్స్.
టాప్‌సెట్స్ చేత చేర్చబడిన C హెడర్స్ తో సంఘర్షణను తప్పించుటకు సిస్టమ్‌టాప్ యిప్పుడు స్థానిక వేరియబుల్సును విచ్ఛిన్నం చేయును.
సిస్టమ్‌టాప్ కంపైల్-సర్వర్ మరియు క్లైంట్ యిప్పుడు IPv6 నెట్వర్కులను తోడ్పాటునిచ్చుచున్నవి.
స్క్రిప్టుల నుండి లో-త్రౌపుట్ అవుట్పుట్ పోల్‌కు తరచు తక్కువ వేక్-అప్స్ అనుమతించుటకు సిస్టమ్‌టాప్ రన్‌టైమ్ (staprun) యిప్పుడు -T టైమ్‌అవుట్ ఐచ్చికం ఆమోదించును.
సిస్టమ్‌టాప్ స్క్రిప్ట్ ట్రాన్సులేటర్ డ్రైవర్ (stap) యిప్పుడు కింది రిసోర్స్ పరిమితి ఐచ్చికాలను అందించును:
lscpu సౌలభ్యం, అందుబాటులోని CPUల గురించి విశదీకృత వివరణ ప్రదర్శించునది యిప్పుడు చాలా కొత్త విశేషణాలను కలిగివుంది. కొత్త సౌలభ్యం, chcpu, కూడా జతచేయబడెను, యిది మీరు CPU స్థితి (online/offline, standby/active, మరియు యితర స్థితిలు)ని మార్చుటకు, CPUలు చేతనం మరియు అచేతనం చేయుటకు, ఫలానా CPUలను ఆకృతీకరించుటకు అనుమతించును.
ఈ సౌలభ్యాల గురించి మరింత సమాచారం కొరకు, lscpu(1) మరియు chcpu(8) man పేజీలు చూడండి.
Chapter 12. సాధారణ నవీకరణలు
నవీకరించిన samba ప్యాకేజీలు
Red Hat Enterprise Linux 6.4 అనునది రీబేస్‌డ్ samba ప్యాకేజీలను కలిగివుండును అది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించును, ముఖ్యమైనది SMB2 ప్రొటోకాల్ కొరకు తోడ్పాటు జతచేయుట. /etc/samba/smb.conf ఫైలు యొక్క [global] విభాగము నందు కింది పారామితితో SMB2 తోడ్పాటు చేతనం చేయవచ్చు:
max protocol = SMB2
అదనంగా, సాంబా యిప్పుడు AES కేర్బరోస్ యెన్క్రిప్షన్ కొరకు తోడ్పాటు కలిగివుంది. Windows Vista మరియు Windows Server 2008 నుండి Microsoft Windows ఆపరేటింగ్ సిస్టమ్స్ నందు AES తోడ్పాటు అందుబాటులో వుంది. సాంబా అది నియంత్రించు కీటాబ్‌నకు కేర్బరోస్ కీలను జతచేయును. దీనర్దం సాంబా కీటాబ్ వుపయోగించు యితర కేర్బరైజ్డ్ సేవలు మరియు అదే మిషన్‌పై నడుచునవి AES యెన్క్రిప్షన్ నుండి మేలు పొందవచ్చు. AES సెషన్ కీలను వుపయోగించుటకు (AES ఎన్క్రిప్టెడ్ టికెట్ గ్రాంటింగ్ టికెట్స్ మాత్రమే వుపయోగించుటకు కాక), ఏక్టివ్ డైరెక్టరీ LDAP సేవికనందలి సాంబా మిషన్ ఖాతా మానవీయంగా సవరించవలసి వుంటుంది. మరింత సమాచారం కొరకు, Microsoft Open Specifications Support Team Blog చూడండి.
Red Hat Enterprise Linux 6.4 కొత్త scipy ప్యాకేజీ చేర్చును. Scipy ప్యాకేజీ అనునది గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, మరియు సాంకేతికశాస్త్రం కొరకు సాఫ్టువేర్ అందించును. ఆర్బిటరీ రికార్డ్స్ యొక్క పెద్ద మల్టీ-డైమెన్షనల్ యెరేస్ మానిప్యులేట్ చేయుటకు రూపొందించిన, NumPy ప్యాకేజీ, SciPy కొరకు కోర్ లైబ్రరీ. SciPy లైబ్రరీ అనునది NumPy యెరేస్‌తో పనిచేయుటకు నిర్మించబడెను మరియు వివిధ సమర్థవంతమైన సంఖ్యా రొటీన్స్ యిచ్చును, వుదాహరణకు సంఖ్యా యింటిగ్రేషన్ మరియు ఆప్టిమైజేషన్ కొరకు రొటీన్స్.
NSS నందు TLS v1.1 తోడ్పాటు
ఇతరములతో కలిపి, TLS వర్షన్ 1.1 కు తోడ్పాటును అందించుటకు, nss మరియు nss-util ప్యాకేజీలు అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను. అదేవిదంగా, nspr ప్యాకేజీ వర్షన్ 4.9.2 కు నవీకరించబడెను. మరింత సమాచారం కొరకు, NSS 3.14 Release Notes చూడండి.
ఎంబడెడ్ Valgrind gdbserver
valgrind ప్యాకేజీ అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.8.1 కు నవీకరించబడెను. ఈ నవీకృత వర్షన్, యితర విస్తరింపులు మరియు బగ్ పరిష్కారాలతోపాటు, ఎంబడెడ్ gdbserver కలిగివుంది. మరింత సమాచారం కొరకు, Valgrind అధ్యాయం మరియు Red Hat Developer Toolset 1.1 User Guide నందలి Changes in Valgrind 3.8.1 ఎపెండిక్స్ చూడండి.
కొత్త libjpeg-turbo ప్యాకేజీలు
Red Hat Enterprise Linux 6.4 కొత్త ప్యాకేజీ సమితిని కలిగివుంది: libjpeg-turbo. ఈ ప్యాకేజీలు సాంప్రదాయ libjpeg ప్యాకేజీలను పునఃస్థాపించును, మరియు libjpeg వలె అదే ఫంక్షనాలిటీని మరియు APIను అందించును, మరింత పనితనంతో.
కొత్త redhat-lsb-core ప్యాకేజీ
redhat-lsb ప్యాకేజీ సంస్థాపించునప్పుడు, LSB ప్రమాణంను చేరుటకు పెద్ద సంఖ్యలో ఆధారములను వ్యవస్థలోనికి లాగును. Red Hat Enterprise Linux 6.4 కొత్త redhat-lsb-core వుపప్యాకేజీను అందించును అది redhat-lsb-core ప్యాకేజీను సంస్థాపించుటచే అవసరమైన కనీస ప్యాకేజీల సమితిని సులువుగా తెచ్చుటకు మిమ్ములను అనుమతించును.
createrepo సౌలభ్యం నవీకరించెను
createrepo సౌలభ్యం సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, అది మెమొరీ వాడుకను గణనీయంగా తగ్గించును మరియు --workers ఐచ్చికం ద్వారా మల్టీటాస్కింగ్ తోడ్పాటును జతచేయును.
పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర
Revision History
Revision 1.2-0
Thu Feb 21 2013
MartinPrpič
Release of the Red Hat Enterprise Linux 6.4 Release Notes.