Red Hat Enterprise Linux 5

5.6 విడుదల నోడ్స్

కొత్త విశేషణములు మరియు ముఖ్య నవీకరణలు

లోగో

Red Hat ఇంజినీరింగ్ కాంటెంట్ సర్వీసెస్

Legal Notice

Copyright © 2010 Red Hat.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

Abstract
Red Hat Enterprise Linux చిన్న విడుదలలు అనునవి స్వతంత్ర వృద్ధి, రక్షణ మరియు బగ్ పరిష్కార యెర్రాటా యొక్క సంకలనం. Red Hat Enterprise Linux 5.6 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దానితోటి అనువర్తనములకు ఈ చిన్న విడుదలనందు చేసిన పెద్ద మార్పులను పత్రికీకరణ చేయును.

1. సంస్థాపకి
2. వర్చ్యులైజేషన్
3. నెట్వర్కింగ్
4. వెబ్ సేవికలు మరియు సేవలు
5. ఫైల్‌సిస్టమ్స్ మరియు నిల్వ
5.1. లాజికల్ వాల్యూమ్ మేనేజర్ (LVM)
6. ధృవీకరణ మరియు యిచ్చిపుచ్చుకొనుట
7. డెస్కుటాప్
8. కెర్నల్
9. పరికర డ్రైవర్లు
9.1. నెట్వర్కు పరికర డ్రైవర్లు
9.2. నిల్వ పరికర డ్రైవర్లు
9.3. డెస్కుటాప్ డ్రైవర్స్ నవీకరణలు
9.4. ముద్రణాయంత్ర పరికరములు
10. అభివృద్దికారి సాధనములు
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

1. సంస్థాపకి

Red Hat Enterprise Linux సంస్థాపకి (anaconda గా కూడా పిలువబడును) Red Hat Enterprise Linux 5 యొక్క సంస్థాపననందు దోహదపడును.
కిక్‌స్టార్ట్
సిస్టమ్ నిర్వహణాధికారులు Red Hat Enterprise Linux సంస్థాపించుట కొరకు వుపయోగించు స్వయంచాలన సంస్థాపనా పద్దతిని కిక్‌స్టార్ట్ చేయును. కిక్‌స్టార్ట్ వుపయోగించి, వొక ఫైల్ సృష్టించబడును, అది సంస్థాపనా కార్యక్రమమునందు సాధారణంగా అడుగు అన్ని ప్రశ్నలకు సమాధానములను కలిగివుండును.
కిక్‌స్టార్ట్ సంస్థాపననందు కొన్ని సందర్భములలో, సంస్థాపకి తాత్కాలికంగా అందుబాటులో లేని రిపోజిటరీనుండి వొక ప్యాకేజీను డౌన్‌లోడ్ చేయుటకు ప్రయత్నించవచ్చును (ఉ.దా. వోవర్‌లోడైన Red Hat Network Satellite). తదనుగుణంగా, గత Red Hat Enterprise Linux 5 విడుదలలనందు, డౌన్‌లోడ్ కోరకు మరలా ప్రయత్నించుటకు లేదా విస్మరించుటకు వినియోగదారి యిన్పుట్ అవసరము. Red Hat Enterprise Linux 5.6 బీటా నందలి సంస్థాపిక రిపోజిటరీకు అనుసంధానమగుటకు స్వయంచాలకంగా చాలా సార్లు ప్రయత్నించును మరియు కావలసిన ప్యాకేజీ అందుబాటులో వున్నప్పుడు డౌన్‌లోడ్ చేయును.
విస్తరిత డ్రైవర్ మద్దతు
Red Hat Enterprise Linux 5.6 బీటా అనునది సంస్థాపనా కార్యక్రమమునందు అవసరమైన పరికరముల కొరకు మెరుగైన డ్రైవర్ మద్దతును అందించును. ఈ విడుదల నందు సంస్థాపికకు కింది డ్రైవర్ల మరియు పరికరముల కొరకు మద్దతు జతచేయడమైంది:
  • 10G PCIe ఈథర్నెట్ కంట్రోలర్స్ కొరకు బ్రొకేడ్ BNA ఈథర్నెట్ కంట్రోలర్ డ్రైవర్.
  • చెల్సియో titleinator4 10G యూనిఫైడ్ వైర్డ్ నెట్వర్క్ కంట్రోలర్స్ కొరకు cxgb4 డ్రైవర్.
  • LSI 3ware 97xx SAS/SATA RAID కంట్రోలర్స్ కొరకు 3w-sas డ్రైవర్.
Red Hat Enterprise Linux 5.6 నందలి యితర డ్రైవర్ నవీకరణలు Section 9, “పరికర డ్రైవర్లు” నందు చర్చించడమైంది

గమనిక — ఇకపై చదువుటకు

Red Hat Enterprise Linux 5 సంస్థాపనా మార్గదర్శి సంస్థాపిక మరియు సంస్థాపనా కార్యక్రమము గురించి విశదీకృత పత్రకీకరణను అందించును.

2. వర్చ్యులైజేషన్

పారా-వర్చ్యులైజ్డ్ డ్రైవర్స్
పారా-వర్చ్యులైజ్డ్ డ్రైవర్స్ (వర్టియో డ్రైవర్స్) అనునవి వర్చ్యువల్ మిషన్ యొక్క బ్లాక్ మరియు నెట్వర్కు పరికరముల కొరకు పనితనమును పెంచును.
వర్టియో బెలూన్ డ్రైవర్ అనునది గెస్టులు హైపర్విజర్‌కు వాటికి యెంత మెమొరీ అవసరమో తెలియపరచుటకు అనుమతించును. గెస్టు కొరకు మెమోరీ కేటాయింపును సమర్ధవంతంగా హోస్టు చేయగల్గునట్లు బెలూన్ డ్రైవర్ అనుమతించును అలాగే యితర గెస్టులకు మరియు ప్రోసెసస్‌కు ఖాళీ మెమొరీను కేటాయించుటకు అనుమతించును. Red Hat Enterprise Linux 5.6 నందు, వర్టియో బెలూన్ డ్రైవర్ మెమొరీ గణాంకాలను సేకరించి నివేదించగలదు.
లిబ్‌వర్ట్
లిబ్‌వర్ట్ అనునది హైపర్విజర్-స్వతంత్ర వర్చ్యులైజేషన్ API అది ఆపరేటింగ్ సిస్టమ్స్ విస్తృతిలో గల వర్చ్యులైజేషన్ సామర్థ్యములతో సంప్రదించగలదు. హోస్టుపైన వర్చ్యులైజ్డ్ గెస్టులను సురక్షితంగా నిర్వహించ గల్గుటకు లిబ్‌వర్ట్ వుమ్మడి, సార్వత్రిక మరియు స్థిరమైన పొరను అందించును.
Red Hat Enterprise Linux 5.6 నందు, లిబ్‌వర్ట్ అనునది వర్షన్ 0.8.2కు నవీకరించబడింది, sVirt చేతనమైంది. sVirt అనునది వొక సాంకేతికత Red Hat Enterprise Linux 5 నందు చేర్చబడింది అది ఎస్‌యిలైనక్స్ మరియు వర్చ్యులైజేషన్‌ను సంయుక్తపరచును. sVirt రక్షణను వద్దిపరచును మరియు హోస్టునకు లేదా వేరే వర్చ్యులైజ్డ్ గెస్టునకు ఎటాక్ వెక్టార్‌గా వుపయోగించగల హైపర్విజర్ నందలి బగ్‌లకు వ్యతిరేకంగా సిస్టమ్‌ను ధృడపరచును.
పివిసిక్లాక్ కొరకు గ్లోబల్ సింక్రొనైజేషన్ పాయింట్
పివిసిక్లాక్ అనునది హోస్ట్ యొక్క క్లాక్ సమయాన్ని చదువుటకు గెస్టును చేతనపరచును. Red Hat Enterprise Linux 5.6 నందు, వొక గ్లోబల్ సింక్రొనైజేషన్ పాయింట్‌ పివిసిక్లాక్‌కు జతచేయబడెను, గెస్టులకొరకు మరింత స్థిరమైన టైమ్ సోర్సును అందించును.
వర్టియో-సీరియల్
వర్టియో-సీరియల్ డ్రైవర్ జతచేయబడెను, Red Hat Enterprise Linux 6 హోస్టులపైన నడుపబడు Red Hat Enterprise Linux 5.6 గెస్టులపైన వియెమ్‌చానల్ సామర్థ్యాలను చేతనపరచును. వియెమ్‌చానల్ అనునది హోస్టు యూజర్‌స్పేస్ మరియు గెస్టు యూజర్‌స్పేస్ మద్యన సంప్రదింపు కొరకు బదిలీకరణ సాంకేతికత వలె వుపయోగించబడును.

3. నెట్వర్కింగ్

బెర్కిలీ యింటర్నెట్ నేమ్ డొమైన్ (‌BIND)
ఆధునిక నెట్వర్కులలో చాలా వరకు, యింటెర్నెట్ నందు కూడా, వాడుకరులు యితర కంప్యూటర్లను పేరుతో గుర్తిస్తారు. దీని వలన వాడుకరులకు నెట్వర్కు మూలాల యొక్క సంఖ్యా నెట్వర్కు చిరునామాలను గుర్తించుకొనుటనుండి విముక్తి లభించినది. అటువంచి పేరు-ఆధారిత అనుసంధానములను అనుమతించునట్లు నెట్వర్కును ఆకృతీకరించుటకు అత్యంత ప్రభావితమైన మార్గము డొమైన్ నేమ్ సర్వీస్ (DNS) లేదా నేమ్‌సర్వర్‌ను అమర్చుట, అది నెట్వర్కునందు హోస్టుపేరులను సంఖ్యా చిరునామాలకు లేదా విలోమంగాను మార్చును.
బెర్కిలీ యింటర్నెట్ నేమ్ డొమైన్ (BIND) అనునది DNS ప్రోటోకాల్స్ యొక్క అభివృద్ది. DNS సేవిక సరిగా పనిచేస్తోందా లేదా నిర్థారించుటకు BIND అనునది DNS సర్వర్‌ను, రిజోల్వర్ లైబ్రరీను, మరియు సాధనములను చేర్చును. Red Hat Enterprise Linux 5.6 బీటా అనునది BIND అభివృద్ది యొక్క 9.7 వర్షన్‌ను చేర్చును. DNS సెక్యూరిటి యెక్స్టెన్షన్స్ (DNSSEC) నందలి నెక్స్ట్ సెక్యూర్ (NSEC3) యొక్క వర్షన్ 3 కొరకు యీ నవీకృత ప్యాకేజీలు మద్దతును జతచేయును. అదనంగా, యీ నవీకరణ సౌలభ్యములు DNSSEC నందలి RSA/SHA-2 అల్గార్థెమ్సును మద్దతించును, మరియు ట్సాన్‌జాక్షన్ సిగ్నేచర్స్ (TSIG) కొరకు HMAC-SHA2 అల్గార్థెమ్సును మద్దతించును.
నెట్వర్క్ డీబగ్గింగ్ డ్రాప్‌వాచ్ వుపయోగించును
కెర్నల్ అనునది నెట్‌లింక్ డ్రాప్ మానిటర్ (DROP_MONITOR) సేవను అందించును అది విశదీకృత నెట్వర్కు పాకెట్ లాస్ మానిటరింగ్‌ను అందించును. Red Hat Enterprise Linux 5.6 అనునది కొత్త dropwatch సౌలభ్యమును డ్రాప్ మానిటర్ సేవతో సంప్రదించుటకు అందించును, మరియు ఫలితాలను యూజర్‌స్పేస్‌కు యిచ్చును.
ఈథర్నెట్ బ్రిడ్జ్ పట్టికలు
బ్రిడ్జ్ ద్వారా దాటిపోవు నెట్వర్కు ట్రాఫిక్‌ను పారదర్శకంగా వడపోయుటకు ఈథర్నెట్ బ్రిడ్జ్ పట్టికలు (ebtables) వొక ఫైర్‌వాలింగ్ సాధనము. అత్యధిక నెట్వర్క్ లేయర్స్ పై లింక్ లేయర్ ఫిల్టరింగ్ మరియు బేసిక్ ఫిల్టరింగ్ కు ఫిల్టరింగ్ సంభావ్యతలు పరిమితం. Red Hat Enterprise Linux 5.6 విడుదలకు ebtables కొత్త ప్యాకేజీ

4. వెబ్ సేవికలు మరియు సేవలు

హైపర్‌టెక్స్ట్ ప్రిప్రోసెసర్ (PHP) 5.3
హైపర్‌టెక్స్ట్ ప్రిప్రోసెసర్ (PHP) అనునది వొక HTML-ఎంబెడెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సాధారణంగా ఎపాచీ HTTP వెబ్ సేవిక నందు వుపయోగించబడును. PHP 5.3.2 వర్షన్ యిప్పుడు Red Hat Enterprise Linux 5.6 బీటానందు ప్రత్యేకంగా php53 ప్యాకేజీవలె అందుబాటులో వుంది.

Note

php ప్యాకేజీ అనునది PHP యొక్క వర్షన్ 5.1.6 ను అందించును, మరియు అది యింకా Red Hat Enterprise Linux 5.6 నందు అందుబాటులో వుంది. php53 సంస్థాపించుటకు ముందుగా php ప్యాకేజీ మరియు దానికి కావలసిన అధారములను తీసివేయునట్లు చూసుకోంటి.
mod_nss
సెక్యూర్ సాకెట్స్ లేయర్ (SSL) మరియు ట్రాన్సుపోర్ట్ లేయర్ సెక్యూరిటి (TLS) ప్రొటోకాల్స్ ద్వారా mod_nss అనునది గట్టి క్రిప్టోగ్రఫీను ఎపాచీ వెబ్ సేవికకు అందించును, నెట్వర్కు సెక్యూరిటి సర్వీసెస్ (NSS) రక్షణ లైబ్రరీ వుపయోగించి. ఈ విడుదల నందు, mod_nss అనునది వర్షన్ 1.0.8 నకు నవీకరించబడెను, ఆన్‌లైన్ సర్టిఫికేట్ స్టేటస్ ప్రొటోకాల్ (OCSP) కు మద్దతును జతచేయును

5. ఫైల్‌సిస్టమ్స్ మరియు నిల్వ

ఫోర్త్ యెక్స్టెండెడ్ ఫైల్‌సిస్టమ్ (ex4) మద్దతు
ఫోర్త్ యెక్స్టెండెడ్ ఫైల్‌సిస్టమ్ (ext4) యిప్పుడు Red Hat Enterprise Linux 5.6 నందు పూర్తిగా మద్దతించు విశేషణము. ext4 అనునది థర్డ్ యెక్స్టెండెడ్ ఫైల్‌సిస్టమ్ (ext3) పై ఆధారపడును మరియు చాలా మెరుగుదలలను అందించును, వీటితో కలుపుకొని: పెద్ద ఫైల్ పరిమాణం మరియు ఆఫ్‌సెట్‌కు మద్దతు, డిస్కు స్పేస్ కేటాయింపు వేగంగా మరియు సమర్థవంతంగా జరుగును, డైరెక్టరీ లోపల సబ్‌డైరెక్టరీలపై యెటువంటి పరిమితిలేదు, వేగవంతమైన ఫైల్ సిస్టమ్ పరిశీలన, మరియు రోబస్ట్ జర్నలింగ్.
Red Hat Enterprise Linux 5.6 బీటానందు ext4 ను పూర్తి మద్దతు ఫైల్‌సిస్టమ్ గా చేర్చుటకు, e4fsprogs ప్యాకేజీ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను. e4fsprogs అనునది ext4 ఫైల్‌సిస్టమ్ సరిదిద్దుటకు, సృష్టించుటకు, సవరించుటకు, మరియు నిర్ధారించుటకు సౌలభ్యములను కలిగి వుంది.

Note

గత Red Hat Enterprise Linux 5 విడుదలలనందు, ext4 అనునది సాంకేతిక మందస్తుదర్శనంలానే వుంది మరియు విడుడల పేరుతో తెలిసి వుండవచ్చును, ext4dev.

5.1. లాజికల్ వాల్యూమ్ మేనేజర్ (LVM)

వాల్యూమ్ విర్వహణ అనునది యాబ్‌స్ట్రాక్షన్ లేయర్‌ను భౌతిక నిల్వనందు తార్కిక నిల్వ వాల్యూమ్‌లను సృష్టించుట ద్వారా సృష్టించును. ఇది భౌతిక నిల్వను నేరుగా వుపయోగించుటపై అనుకూలతను అందించును. Red Hat Enterprise Linux 5.6 అనునది లాజికల్ వాల్యూమ్సును లాజికల్ వాల్యూమ్ మేనేజర్ (LVM) వుపయోగించి నిర్వహించును.

ఇకపై చదువుటకు

లాజికల్ వాల్యూమ్ మేనేజర్ యెడ్మినిస్ట్రేషన్ పత్రము LVM లాజికల్ వాల్యూమ్ మేనేజర్‌ను వివరించును, LVMను క్లస్టర్డ్ వాతావరణంపై నడుపే సమాచారంతో సహా.
మిర్రర్ లాగ్సును మిర్రర్‌చేయుట
LVM చిన్న లాగ్‌ను నిర్వహించును (ప్రత్యేక పరికరముపై) అది దానిని యేయే ప్రాంతములు మిర్రర్ లేదా మిర్రర్సుతో సింకైవున్నాయో పరిశీలించుటకు వుపయోగించును. Red Hat Enterprise Linux 5.6 యీ లాగ్ పరికరమును మిర్రర్ చేయు సామర్ధ్యాన్నిచ్చును.
మిర్రర్ యొక్క ఆవృత ప్రతిబింబమును విభజించుట
కొత్త లాజికల్ వాల్యూమ్‌ను యేర్పరుచుటకు మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్ యొక్క ఆవృత ప్రతిబింబమును విభజించుటకు lvconvert ఆదేశము యొక్క --splitmirrors ఆర్గుమెంట్‌ వుపయోగంను Red Hat Enterprise Linux 5.6 పరిచయం చేస్తోంది.
ఆకృతీకరణ
అప్రమేయ దత్తాంశ సర్దుబాటు మరియు వాల్యూమ్ గ్రూప్ మెటాడాటా కొరకు Red Hat Enterprise Linux 5.6 నందలి LVM అదనపు ఆకృతీకరణ ఐచ్చికాలను అందించును.

6. ధృవీకరణ మరియు యిచ్చిపుచ్చుకొనుట

సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమోన్ (SSSD)
సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమోన్ (SSSD) అనునది Red Hat Enterprise Linux 5.6 నందు కొత్త విశేషణము అది గుర్తింపు మరియు ధృవీకరణ యొక్క కేంద్రీయ నిర్వహణ కొరకు సేవల సమితిని వద్దిపరచును. గుర్తింపు మరియు ధృవీకరణ సేవలను కేంద్రీయం చేయుట అనునది గుర్తింపుల యొక్క స్థానిక క్యాచింగ్‌ను చేతనం చేయును, సేవికకు అనుసంధానం యెచట ఆటంకపరచబడెనో గుర్తించుటకు వాడుకరులను అనుమతించును. SSSD చాలా రకాలైన గుర్తింపు మరియు ధృవీకరణ సేవలను మద్దతించును, వీటితో కలుపుకొని: Red Hat డైరెక్టరీ సర్వర్, ఏక్టివ్ డ్రైరెక్టరీ, వోపెన్LDAP, 389, కేర్బరోస్ మరియు LDAP.
సాంబా
ఫైళ్ళ, ముద్రికల మరియు యితర సమాచారం యొక్క భాగస్వామీకరణను చేతనము చేయుటకు సాంబా అనునది ప్రోగ్రామ్ల సంకలనం అది TCP/IP నందు NetBIOS వుపయోగించును. ఈ ప్యాకేజీ సర్వర్ మెసేజ్ బ్లాక్ లేదా SMB సర్వర్‌ను అందించును (కామన్ యింటర్నెట్ ఫైల్ సిస్టమ్ లేదా CIFS సర్వర్‌గా కూడా తెలుపబడును) అది SMB/CIFS క్లైంట్లకు నెట్వర్కు సేవలను అందించగలదు.
సాంబా యొక్క రెండు పరస్పర విభేదిత వర్షన్లు (samba లేదా samba3x ద్వారా అందించబడునవి) అందుబాటులో వున్నాయి. Red Hat Enterprise Linux 5.6 నందు samba3x అనునది వర్షన్ 3.5.4కు నవీకరించబడెను, LDAP-ఆధారిత నిల్వలకు మరియు IPv6 నందు విన్‌బైండ్‌కు అదనపు మద్దతు అందించును.

7. డెస్కుటాప్

జపనీస్ IPA ఫాంట్ మద్దతు
IPA ఫాంట్ అనునది JIS X 0213:2004 కంప్లైంట్ జపనీస్ వోపెన్‌టైప్ ఫాంట్ యిన్ఫర్‌మేషన్-టెక్నాలజి ప్రొమోషన్ యెజెన్సీ, జపాన్ ద్వారా అందించబడింది. Red Hat Enterprise Linux 5.6 కొత్త ipa-gothic-fonts ప్యాకేజీ పరిచయం చేస్తోంది, గోతిక్ (sans-serif) శైలి ఫాంట్ కలిగివుంది మరియు కొత్త ipa-mincho-fonts ప్యాకేజీ, Mincho-style ఫాంట్ కలిగివుంది.
టాబ్లెట్ మద్దతు
Red Hat Enterprise Linux 5.6 అనునది Wacom Cintiq 21UX2 గ్రాఫిక్స్ టాబ్లెట్ కొరకు మద్దతును పరిచయంచేస్తోంది.
గోస్టుస్క్రిప్ట్
గోస్ట్‌స్క్రిప్ట్ సూట్ పోస్టుస్క్రిప్ట్(TM) యింటర్‌ప్రీటర్ అందించును, C పద్దతుల సమితి (గోస్టుస్క్రిప్ట్ లైబ్రరీ, అది పోస్టుస్క్రిప్ట్ భాష నందు గ్రాఫిక్స్ సామర్ధ్యాలను మెరుగుపరచును, మరియు PDF ఫైళ్ళ కొరకు యింటర్‌ప్రీటర్ మెరుగుపరచును. గోస్టుస్క్రిప్ట్ అనునది పోస్టుస్క్రిప్టు కోడ్‌ను చాలా వుమ్మడి, బిట్‌మాప్డ్ రూపాలలోకి అనుదించును, అవి చాలా ముద్రికలు మరియు ప్రదర్శనల ద్వారా అర్దంకాబడునట్లు. ఇది వాడుకరులను పోస్టుస్క్రిప్ట్ ఫైళ్ళను ప్రదర్శించుటకు చేతనపరచును మరియు వాటిని నాన్-పోస్టుస్క్రిప్ట్ ముద్రికలపై ముద్రించును.
Red Hat Enterprise Linux 5.6 నందు, గోస్టుస్క్రిప్ట్ వర్షన్ 8.70కు నవీకరించబడెను, OPVP 1.0 కొరకు మద్దతునిస్తోంది.

8. కెర్నల్

Red Hat Enterprise Linux 5.6 నందు అందించబడిన కెర్నల్ వందల కొద్ది బగ్‌లకు పరిష్కారాలను మరియు లైనక్స్ కెర్నల్ విస్తరింపులను కలిగివుంది. ఈ విడుదల కొరకు పరిష్కరించబడిన ప్రతి బగ్ గురించిన సమాచారము కొరకు మరియు యీ విడుదలనందు జతచేయబడిన కెర్నల్ విస్తరింపులపై సమాచారము కొరకు, Red Hat Enterprise Linux 5.6 Technical Notes నందలి కెర్నల్ అధ్యాయం చూడుము.
ఈ విడుదలనందు కెర్నల్‌కు అత్యంత గుర్తించదగిన నవీకరణలు మరియు చేర్పులు:
  • ట్రస్టెడ్ ప్లాట్‌ఫాం మాడ్యూల్ (TPM) మైక్రోకంట్రోలర్స్ కొరకు tpm_tis డ్రైవర్ యిప్పుడు స్వయంచాలకంగా బూట్ సమయం వద్ద లోడగును.
  • AMD ప్రోసెసర్స్ పైని యాక్చువల్ పర్ఫామ్మెన్స్ క్లాట్ కౌంటర్ (APERF) మరియు మాగ్జిమమ్ క్వాలిఫైడ్ పర్ఫామ్మెన్స్ క్లాక్ కౌంటర్ (MPERF) మోడల్-స్పెసిఫిక్ రిజిస్టర్స్(MSRs)కు మద్దతు జతచేయబడింది.
  • ITE-887x చిప్స్ కొరకు మద్దతు
  • పవర్ PC ప్లాట్‌ఫాంల కొరకు VIO పవర్ నిర్వహణ మద్దతు
  • qeth డ్రైవర్ నందలి OSX మరియు OSM OSA CHPID రకముల కొరకు మద్దతు జతచేయబడెను
  • నవీకరించిన ఎడ్వాన్సుడ్ లైనక్స్ సౌండ్ ఆర్కిటెక్చర్ - హై డెఫినిషన్ ఆడియో (ALSA-HDA) డ్రైవర్స్.
  • సిస్టమ్‌టాప్ యొక్క వర్షన్ 1.3, యింటిగ్రేటెడ్ కంపైలర్-సర్వర్ ఆకృతిని అందిస్తుంది, ఆటోమాటిక్ స్ట్రక్చర్ ప్రెట్టీ-ప్రింటింగ్, వేగమైన మరియు మెరుగైన స్టాక్ బ్యాక్‌ట్రాక్స్, మరియు కొత్త మాదిరి స్క్రిప్ట్స్.
  • ఒక నవీకృత కెర్నల్ పోర్బ్స్ (కెపోర్బ్స్) అభివృద్ది
  • నవీకృత పర్-స్టాక్ గణాంకాల యింటర్ఫేస్ (టాస్కుస్టాట్స్)
  • TCP క్యూబిక్ కంజస్టెడ్ నియంత్రణ కొరకు కొత్త మద్దతు
  • నెట్వర్కింగ్ స్టాక్ నందలి వన్ పాకెట్ ప్రణాళకి కొరకు కొత్త మద్దతు
  • రెండు నెట్వర్కింగ్ ట్యూనింగ్ పారామితులు, ip_local_reserved_ports మరియు ip_local_port_range పారామితి, ముడో-వ్యక్తి అనువర్తనముల కొరకు వాడుకరి పోర్టులను నిలిపివుంచుటకు అనుమతించును, తెలిసిన ఆటంకిత పోర్టులను బ్లాక్‌లిస్ట్ చేయును.
  • /dev/zero పరికరము యొక్క ZERO_PAGE mmap వదిలివేయుటకు /proc/sys/vm/vm_devzero_optimized పారామితి
  • iSNS కొరకు విస్తరింపులు, iSCSI ప్రారంభికనందు, మరియు iSNS సర్వర్
  • kABI నవీకరణలు

9. పరికర డ్రైవర్లు

9.1. నెట్వర్కు పరికర డ్రైవర్లు

  • I/O AT (I/O యాగ్జెలరేషన్ సాంకేతికత) మరియు DCA డ్రైవర్లు నవీకరించబడెను. కాపీ ఆపరేషన్ల ఆఫ్‌లోడింగ్ ద్వారా నెట్వర్కు త్రౌపుట్ మెరుగు పరచుటకు I/O AT అనునది ఇంటెల్ ద్వారా సాంకేతికతల సమాహారం. డైరెక్ట్ క్యాచీ యాక్సెస్ (DCA) అనునది I/O AT విశేషణం అది దత్తాంశంను నేరుగా ప్రోసెసర్ క్యాచీలలోకి పంపగలదు.
  • ZyDAS ZD1211(b) 802.11a/b/g USB WLAN పరికరము కొరకు zd1211 డ్రైవర్ యిప్పుడు Red Hat Enterprise Linux 5.6 బీటానందు మద్దతించును.
  • qlcnic డ్రైవర్ యిప్పుడు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను
  • ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరముల కొరకు be2net డ్రైవర్ వర్షన్ 2.102.512r కు నవీకరించబడెను
  • Broadcom NetXtreme II network కార్డ్స్ కొరకు bnx2 డ్రైవర్ వర్షన్ 2.0.8 కు నవీకరించబడెను
  • Broadcom Everest నెట్వర్కు పరికరముల కొరకు bnx2x డ్రైవర్ వర్షన్ 1.52.53-4కు నవీకరించబడెను
  • NVIDIA nForce పరికరముల కొరకు forcedeth ఈథర్నెట్ డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను
  • Intel PRO/1000 ఈథర్నెట్ పరికరముల కొరకు e1000e డ్రైవర్ అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.2.7-k2కు నవీకరించబడును
  • Cisco 10G ఈథర్నెట్ పరికరముల కొరకు enic డ్రైవర్ వర్షన్ 1.4.1.2 కు నవీకరించబడెను
  • Intel Gigabit ఈథర్నెట్ యెడాప్టర్స్ కొరకు igb డ్రైవర్ నవీకరించబడెను, PCI-AER కొరకు మద్దతునిస్తోంది
  • Intel 10 Gigabit PCI Express నెట్వర్కు పరికరముల కొరకు ixgbe డ్రైవర్ వర్షన్ 2.0.84-k2 కు నవీకరించబడెను
  • NetXen Multi port (1/10) Gigabit నెట్వర్కు పరికరముల కొరకు netxen డ్రైవర్ వర్షన్ 4.0.73కు నవీకరించబడెను
  • QLogic 10 Gigabit PCI-E ఈథర్నెట్ పరికరముల కొరకు qlge డ్రైవర్ వర్షన్ 1.00.00.25 కు నవీకరించబడెను
  • Solarflare డ్రైవర్ (sfc) వర్షన్ 2.6.36-4c1 కు నవీకరించబడెను
  • Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరముల కొరకు tg3 డ్రైవర్ వర్షన్ 3.108+ కు నవీకరించబడెను
  • Neterion's X3100 Series 10GbE PCIe పరికరముల కొరకు vxge డ్రైవర్ వర్షన్ 2.0.8.20182-k కు నవీకరించబడెను

9.2. నిల్వ పరికర డ్రైవర్లు

  • HP స్మార్ట్ యెరే కంట్రోలర్స్ కొరకు cciss డ్రైవర్ వర్షన్ 3.6.22.RH1 కు నవీకరించబడెను
  • qla4xxxqla4xxx డ్రైవర్ వర్షన్ 5.02.03.00.05.06-d1 కు నవీకరించబడెను
  • Broadcom NetXtreme II iSCSI కొరకు bnx2i డ్రైవర్ వర్షన్ 2.1.3కు నవీకరించబడెను
  • ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరముల కొరకు be2iscsi డ్రైవర్ నవీకరించబడెను.
  • Emulex Fibre Channel Host Bus Adapters కొరకు lpfc డ్రైవర్ వర్షన్ 8.2.0.87కు నవీకరించబడెను
  • ipr డ్రైవర్ వర్షన్ 2.2.0.4కు నవీకరించబడెను
  • 3w-sas డ్రైవర్ వర్షన్ 3.26.00.028-2.6.18RH కు నవీకరించబడెను
  • 3ware SATA RAID నియంత్రికల కొరకు 3w-xxxx డ్రైవర్ వర్షన్ 2.26.08.007-2.6.18RH కు నవీకరించబడెను
  • Chelsio host bus adapters (HBAs) కొరకు cxgb3i డ్రైవర్ నవీకరించబడెను.
  • LSI MegaRAID SAS నియంత్రికల కొరకు megaraid_sas డ్రైవర్ వర్షన్ 4.31కు నవీకరించబడెను
  • LSI నుండి SAS-2 ఫ్యామిలీ యెడాప్టర్సును మద్దతించు mpt2sas డ్రైవర్ వర్షన్ 05.101.00.02 కు నవీకరించబడెను
  • QLogic Fibre Channel HBAs కొరకు qla2xxx డ్రైవర్ వర్షన్ 8.03.01.05.05.06-k కు నవీకరించబడెను

9.3. డెస్కుటాప్ డ్రైవర్స్ నవీకరణలు

  • ఇంటెల్ యింటిగ్రేటెడ్ డిస్‌ప్లే పరికరముల కొరకు i810 డ్రైవర్స్ IronLake గ్రాఫిక్స్ మద్దతుకొరకు నవీకరించబడెను.
  • Volari Z9s పరికరముల మద్దతు కొరకు sis డ్రైవర్ నవీకరించబడెను.
  • Matrox వీడియో పరికరముల కొరకు mga డ్రైవర్ నవీకరించబడెను, G200eH పరికరము కొరకు మద్దతుతో.

9.4. ముద్రణాయంత్ర పరికరములు

  • HPLIP (Hewlett-Packard లైనక్స్ యిమేజింగ్ మరియు ప్రింటింగ్ ప్రోజెక్ట్) ప్యాకేజీ HP ముద్రికలకు మరియు బహుళ-ప్రమేయ విభాగములకు డ్రైవర్లను అందించును. HPLIP వర్షన్ 3.9.8 యిప్పుడు ప్రత్యేక hplip3 ప్యాకేజీ వలె అందుబాటులో వుంది. hplip3 ప్యాకేజీ అనునది HPLIP యొక్క కొత్త వర్షన్ అందించును అది Red Hat Enterprise Linux 5 తో అందిచన వర్షన్‌తో పాటు సంస్థాపించవచ్చును. సంభందిత కమాండ్ లైన్ సౌలభ్యములు hp- బదులుగా hp3- తో ప్రిఫిక్స్ అయివుంటాయి, వుదాహరణకు: hp3-setup.

10. అభివృద్దికారి సాధనములు

GNU గెట్‌టెక్స్ట్
GNU గెట్‌టెక్స్ట్ ప్యాకేజీ అనునది సాధనముల సమితిని మరియు పత్రికీకరణను ప్రోగ్రామ్స్ నందు బహుళ-భాష్యా సందేశములను వుత్పన్నంచేయుటకు అందించును. Red Hat Enterprise Linux 5.6 నందు, గెట్‌టెక్స్ట్ వర్షన్ 0.17కు నవీకరించబడెను. ఈ నవీకరించిన గెట్‌టెక్స్ట్ ప్యాకేజీనందు జావా మరియు libintl.jar మద్దతు నిలిపివేయబడెను.
సబ్‌వర్షన్
సబ్‌వర్షన్ (SVN) అనునది స్థిరమైన వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అది అన్ని మార్పుల యొక్క చరిత్రను సేకరించునప్పుడు ఫైళ్ళ మరియు డైరెక్టరీల హైరార్కీను అభివృద్ది పరచుటకు మరియు నిర్వహించుటకు వొకరు లేదా యెక్కువ వాడుకరుల సమిష్టికృషిని సాధ్యపరుస్తుంది. Red Hat Enterprise Linux 5.6 నందు సబ్‌వర్షన్ 1.6.11 కు నవీకరించబడెను, కొత్త మెర్జ్ ట్రాకింగ్ మరియు యింటరాక్టివ్ కాన్ఫ్లిక్ట్ రిజొల్యూషన్ విశేషణాలను పరిచయం చేస్తోంది.
GDB నందు పైథాన్ స్క్రిప్టింగ్
నవీకరణ అనునది GNU ప్రోజెక్ట్ డీబగ్గర్ (GDB) యొక్క కొత్త వర్షన్ అందించును, కొత్త పైథాన్ API అందిస్తోంది. ఈ API అనునది GDB పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నందు వ్రాయబడిన స్క్రిప్టులను వుపయోగించి స్వయంచాలనం అగుటకు అనుమతించును.
పైథాన్ API యొక్క వొక గమనించదగ్గ విశేషణం GDB అవుట్పుట్‌ను ఫార్మాట్ చేయగల్గుట (సాధారణంగా ప్రెట్టీ-ప్రింటింగ్ వలె చెప్పబడును) పైథాన్ స్క్రిప్టులను వుపయోగించి. గతంలో, ప్రెట్టీ-ప్రింటింగ్ అనునది GDB నందు ప్రామాణిక ముద్రణ అమరికలను వుపయోగించి ఆకృతీకరించబడేది. ప్రెట్టీ-ప్రింటర్ స్క్రిప్టులను సృష్టించగల్గుట వలన వాడుకరి ప్రత్యేక అనువర్తనముల కొరకు GDB సమాచారం యెలా ప్రదర్శించాలో వినియోగదారి నియంత్రించగలడు. Red Hat Enterprise Linux పూర్తి ప్రెట్టీ-ప్రింటర్ స్క్రిప్టుల సూట్‌ను GNU ప్రామాణిక C++ లైబ్రరీకు (libstdc++) అందించును.
GNU కంపైలర్ కలక్షన్ (GCC)
GNU కంపైలర్ కలక్షన్ (GCC) కూడా కలిగివుంది, యితరములతో కలిపి, C, C++, మరియు జావా GNU కంపైలర్స్ మరియు సంభందిత మద్దతు లైబ్రరీలు. Red Hat Enterprise Linux 5.6 అనునది GCC వర్షన్ 4.4ను అందించును , Red Hat Enterprise Linux 6 తో యింటరాపరబిలిటి అందించును.
GNU C లైబ్రరీ (glibc)
GNU C లైబ్రరీ (glibc) ప్యాకేజీలు Red Hat Enterprise Linux పై చాలా ప్రోగ్రామ్‌లు వుపయోగించిన ప్రామాణిక C లైబ్రరీలను కలిగివుంది. ఈ ప్యాకేజీలు ప్రామాణిక C మరియు ప్రామాణిక మాథ్ లైబ్రరీలను కలిగివున్నాయి. ఈ రెండు లైబ్రరీలు లేకుండా, లైనక్స్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు.
glibc అనునది Red Hat Enterprise Linux 5.6 నందు నవీకరించబడెను, POWER7 మరియు ISA 2.06 CPUల కొరకు మద్దతును అందిస్తోంది.
ఓపెన్JDK
Red Hat Enterprise Linux 5.6 నందలి ఓపెన్JDK అనునది IcedTea వర్షన్ 1.7.5కు నవీకరించబడెను. ఈ నవీకరణ కింది గమనించదగ్గ చేర్పులను అందించును:
  • హాట్‌స్పాట్ స్థిరత్వం మరియు పనితనం మెరుగుదలలు
  • Xరెండర్ పైప్‌లైన్ మద్దతు
  • దృశ్యనీయ యెనామలీస్ కొరకు, సింక్రొనల్ సమయక్షేత్ర మద్దతు కొరకు tzdata వుపయోగించి పరిష్కారములు
  • మెరుగైన గ్రాఫిక్స్ ఫైల్ మద్దతు మరియు మొత్తం JAR పనితనం
  • NUMA కేటాయింపు మద్దతు

A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 0-23Tue Dec 07 2010Ryan లెర్చ్
ప్రాధమిక విడుదల నోడ్స్