Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 5

5.9 విడుదల నోడ్స్

Red Hat Enterprise Linux 5.9 విడుదల నోట్స్

సంచిక 9

చట్టబద్ద నోటీసు

Copyright © 2012 Red Hat, Inc.

The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.

Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.

Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.

Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.

Java® is a registered trademark of Oracle and/or its affiliates.

XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.

MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.

All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701

సంక్షిప్తము

విడివిడి విస్తరింపు యొక్క సమ్మేళనమే Red Hat Enterprise Linux చిన్న విడుదలలు, రక్షణ మరియు బగ్ ఫిక్స్ యెర్రాటా. Red Hat Enterprise Linux 5.9 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దాని అనుభందిత అనువర్తనముల కొరకు యీ చిన్న విడుదల నందు చేసిన పెద్ద మార్పులను పత్రకీకరణ చేయును. ఈ చిన్న విడుదల నందలి అన్ని మార్పులపైని విశదీకృత నోట్స్ సాంకేతిక నోట్స్ నందు అందుబాటులో వుంటాయి.
ముందుమాట
1. హార్డువేర్ తోడ్పాటు
2. కెర్నల్
3. పరికర డ్రైవర్లు
3.1. నిల్వ డ్రైవర్లు
3.2. నెట్వర్కు పరికరాలు
3.3. నానారకములైన డ్రైవర్లు
4. ఫైల్ సిస్టమ్ మరియు నిల్వ నిర్వహణ
5. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ
6. రక్షణ మరియు ధృవీకరణ
7. కంపైల్ మరియు సాధనాలు
8. క్లస్టరింగ్
9. వర్చ్యులైజేషన్
10. సాధారణ నవీకరణలు
A. పునఃపరిశీలన చరిత్ర

ముందుమాట

Red Hat Enterprise Linux 5.9 నందు అభివృద్ది చేసిన మెరుగుదలలు మరియు చేరికల గురించి విడుదల నోట్స్ అధిక స్థాయిలో వివరణను అందించును. Red Hat Enterprise Linux 5.9 కు గల అన్ని మార్పులపై విశదీకృత పత్రికీకరణ కొరకు, సాంకేతిక నోట్స్. చూడండి.

అధ్యాయము 1. హార్డువేర్ తోడ్పాటు

ConnectX-3 పరికరాల కొరకు mstflint తోడ్పాటు
mstflint ప్యాకేజీ, ఇది Mellanox ఫర్మువేర్ బర్నింగ్ మరియు డయోగ్నొస్టిక్ సాధనాలు అందించును, యిప్పుడు Mellanox ConnectX-3 పరికరాల కొరకు తోడ్పాటును చేర్చును.

HP స్మార్ట్ యెరే నియంత్రికలు మరియు MegaRAID కొరకు smartmontools తోడ్పాటు
smartmontools ప్యాకేజీ, ఇది SMART-సామర్థ్య హార్డు డ్రైవులను పర్యవేక్షించుటకు సాధనాలు అందించును, యిది HP స్మార్ట్ యెరే నియంత్రికలకు తోడ్పాటును జతచేయుటకు నవీకరించబడెను. ఈ నవీకరణ మెరుగుపరచిన MegaRAID తోడ్పాటును కూడా జతచేయును.

ipmitool delloem ఆదేశాలు నవీకరించబడెను
Dell-specific IPMI పొడిగింత, ఇది delloem వుపఆదేశంను ipmitool సౌలబ్యమునకు జతచేసెను, అది కింది విస్తరింపులను చేర్చుటకు నవీకరించబడెను:
  • కొత్త vFlash ఆదేశం, ఇది వాడుకరులను పొడిగింపు SD కార్డ్స్ గురించిన సమాచారం ప్రదర్శించుటకు అనుమతించును.
  • కొత్త setled ఆదేశం, ఇది వాడుకరులను బ్యాక్‌ప్లేన్ LED స్థితిని ప్రదర్శించుటకు అనుమతించును.
  • మెరుగైన దోష వివరణలు.
  • కొత్త హార్డువేర్ కొరకు తోడ్పాటు జతచేసెను.
  • ipmitool మాన్యువల్ పేజీ నందు ipmitool delloem ఆదేశాల పత్రకీకరణ నవీకరించెను.

NetApp LUNs కొరకు ఆకృతీకరణ నవీకరించెను
NetApp LUN అంతర-నిర్మిత ఆకృతీకరణ యిప్పుడు tur పాత్ పరిశీలకిని అప్రమేయంగా వుపయోగించును. కింది హార్డువేర్ పట్టిక పారామితులు కూడా నవీకరించబడెను:
  • flush_on_last_del చేతనమైను,
  • dev_loss_tmo అనునది 600 కు అమర్చెను,
  • fast_io_fail_tmo అనునది 5 కు అమర్చెను,
  • మరియు pg_init_retries 50కు అమర్చెను.

అధ్యాయము 2. కెర్నల్

సిస్టమ్ కాల్ ట్రేస్‌పాయింట్స్
సిస్టమ్ కాల్ ఘటనల కొరకు కింది ట్రేస్‌పాయింట్స్ జతచేయబడెను:
  • sys_enter
  • sys_exit

HAVE_SYSCALL_TRACEPOINTS ఆకృతీకరణ ఐచ్చికం చేతనం చేసివున్న ఆకృతులపైన మాత్రమే సిస్టమ్ కాల్ ప్రవేశ మరియు నిష్క్రమణ ట్రేస్‌పాయింట్స్ తోడ్పాటు నివ్వబడును.

IPv6 UDP హార్డువేర్ చెక్‌సమ్
IPv6 నందు నడుచు UDP కొరకు Red Hat Enterprise Linux 5.9 హార్డువేర్ చెక్‌సమ్ తోడ్పాటును జతచేయును.

ప్రి-ప్రోసెస్ వనరు పరిమితులు
/proc/<PID>/limits ఫైలు (ఈ ఫైలు యిప్పుడు వ్రాయదగినది) ద్వారా నడుస్తున్న ప్రోసెస్ యొక్క పరిమితులను గతికంగా మార్చుటకు వాడుకరులను అనుమతించుటకు prlimit64() సిస్టమ్ కాల్ జతచేయబడెను.

pktgen కు VLAN తోడ్పాటు జతచేయబడెను
VLAN తోడ్పాటు pktgen మాడ్యూల్‌కు జతచేయబడెను. pktgen మాడ్యూల్ యిప్పుడు 802.1Q టాగ్గడ్ ఫ్రేమ్‌లను అందించగలదు.

/proc/<PID>/ కు యాక్సెస్ నిర్భందించుట
/proc/<PID>/ సంచయాలకు యాక్సెస్ నిర్భందన అనుమతించుటకు hidepid= మరియు gid= మౌంట్ ఐచ్చికాలు procfs కు జతచేయబడెను.

DSCP ఫీల్డ్ మాంగిలింగ్
Red Hat Enterprise Linux 5.9 నందు, netfilter మాడ్యూల్ యిప్పుడు DSCP ఫీల్డ్ మాంగిలింగ్ తోడ్పాటునిచ్చును.

అధ్యాయము 3. పరికర డ్రైవర్లు

3.1. నిల్వ డ్రైవర్లు

  • mptfusion డ్రైవర్ వర్షన్ 3.04.20కు నవీకరించబడెను, అది కింది పరికర ఐడిను జతచేయను: SAS1068_820XELP.
  • QLogic Fibre-Channel HBAs కొరకు qla2xxx డ్రైవర్ వర్షన్ 8.04.00.05.05.09-k కు నవీకరించబడెను
  • qla4xxx డ్రైవర్ వర్షన్ 5.02.04.05.05.09-d0 కు నవీకరించబడెను.
  • Emulex ఫైబర్-చానల్ హోస్ట్ బస్ యెడాప్టర్స్ కొరకు lpfc డ్రైవర్ వర్షన్ 8.2.0.128.3p కు నవీకరించబడెను.
  • ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరముల కొరకు be2iscsi డ్రైవర్ 4.2.162.0r కు నవీకరించబడెను.
  • Broadcom NetXtreme II iSCSI కొరకు bnx2i డ్రైవర్ వర్షన్ 2.7.2.2 కు నవీకరించబడెను.
  • Brocade BFA FC SCSI డ్రైవర్ (bfa డ్రైవర్) యికపై సాంకేతిక ముందస్తుదర్శనం గా వుండదు. Red Hat Enterprise Linux 5.9 నందు, BFA డ్రైవర్‌కు పూర్తి తోడ్పాటు వుంది. అదనంగా, Brocade bfa FC SCSI డ్రైవర్ అనునది వర్షన్ 3.0.23.0 కు నవీకరించబడెను, అది యితరములతో కలిపి, కింది విస్తరింపులను కలిగివుంది:
    • ఫైబర్-చానల్ అతిధేయి నుండి లూప్ యినిషలైజేషన్ ప్రొటోకాల్ (LIP) జారీచేయుటకు తోడ్పాటు.
    • ఎక్స్‌టెండెడ్ లింక్ సర్వీసెస్ (ELS) మరియు కామన్ ట్రాన్స్‌పోర్ట్ (CT) ఫైబర్-చానల్ పాస్‌త్రూ ఆదేశాల కొరకు తోడ్పాటు.
    • IOCTL ఇంటర్ఫేస్ జతచేసెను.
  • bfaఫర్మువేర్ వర్షన్ 3.0.23.0 కు నవీకరించబడెను.
  • mpt2sas డ్రైవర్ వర్షన్ 13.101.00.00 కు నవీకరించబడెను, అది NUMA I/O తోడ్పాటు జతచేయును, త్వరితంగా లోడవు తోడ్పాటును, మరియు వినియోగదారి ప్రత్యేక బ్రాడింగ్ కొరకు తోడ్పాటును జతచేయును.
  • megaraid_sas డ్రైవర్ వర్షన్ 00.00.06.15-rh కు నవీకరించబడెను, ఇది Dell PowerEdge RAID నియంత్రిక (PERC) 9, LSI MegaRAID SAS 9360/9380 12GB/s నియంత్రికలకు, మరియు బహుళ MSI-X vector మరియు బహుళ reply queue కు తోడ్పాటును జతచేయును.
  • Broadcom NetXtreme II BCM5706/5708/5709 సీరీస్ PCI/PCI-X Gigabit Ethernet Network Interface Card (NIC) మరియు Broadcom NetXtreme II BCM57710/57711/57712/57800/57810/57840 సీరీస్ PCI-E 10 Gigabit Ethernet Network Interface Card కొరకు iscsiuio డ్రైవర్ వర్షన్ 0.7.4.3 కు నవీకరించబడెను, యిది యితరములతో కలిపి, కింది విస్తరింపులను, VLAN మరియు రౌంటిగ్ తోడ్పాటును కలిగివుంది.

3.2. నెట్వర్కు పరికరాలు

  • Red Hat Enterprise Linux 5.9 వచ్చిన కెర్నల్‌కు ib_qib డివైజ్ డ్రైవర్ తోడ్పాటు జతచేయబడెను. ib_qib డ్రైవర్ అనునది QLogic's యొక్క ib_ipath InfiniBand Host Channel Adapter (HCA) డివైజ్ పరికరపు నవీకృత వర్షన్ (మరియు పునఃస్థాపన) మరియు SDR, DDR, మరియు QDR InfiniBand యెడాప్టర్స్ యొక్క సరికొత్త PCI Express QLE-series కు తోడ్పాటు అందించును.
  • Solarflare డ్రైవర్ (sfc) అనునది వర్షన్ 3.1 కు నవీకరించబడెను, అంది SFE4003 board మరియు TXC43128 PHY తోడ్పాటుకు తోడ్పాటు అందించును.
  • bnx2x ఫర్మువేర్ వర్షన్ 7.2.51 కు నవీకరించబడెను బ్రోడ్‌కామ్ 57710/57711/57712 చిప్సుకు తోడ్పాటును చేర్చుటకు.
  • Broadcom 578xx కుటుంబపు చిప్స్ కు, iSCSI ఆఫ్‌లోడ్‌కు, అదనపు PHYs (EEE తో కలిపి)కు, OEM-specific విశేషణాలకు, తోడ్పాటునిచ్చుటకు మరియు చాలా బగ్‌లను పరిష్కరించుటకు, bnx2x డ్రైవర్ 1.72.51-0+ కు నవీకరించబడెను.
  • bnx2 డ్రైవర్ వర్షన్ 2.2.1+ కు నవీకరించబడెను.
  • FCoE పారిటీ దోషం సరిదిద్దుటకు, గణాంకాల తోడ్పాటుకు, మరియు FCoE సామర్థ్యాల ప్రకటనకు cnic డ్రైవర్ మరియు పర్మువేర్ నవీకరించబడెను.
  • నెట్వర్కు పరికరాల Chelsio T3 ఫ్యామిలీ కొరకు cxgb3 డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • Chelsio Terminator4 10G Unified Wire Network నియంత్రికల కొరకు cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, అది Chelsio T480-CR మరియు T440-LP-CR ఎడాప్టర్సుకు తోడ్పాటును జతచేయును.
  • cxgb4 ఫర్మువేర్ అనునది అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.4.23.0 కు నవీకరించబడెను.
  • iw_cxgb3 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • iw_cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
  • cxgb4i, cxgb3i, మరియు libcxgbi డ్రైవర్లు నవీకరించబడెను.
  • netxen_nic డ్రైవర్ వర్షన్ 4.0.79 కు నవీకరించబడెను, అది Minidump తోడ్పాటును చేర్చును.
  • Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరముల కొరకు tg3 డ్రైవర్ వర్షన్ 3.123 కు నవీకరించబడెను.
  • Intel 10 Gigabit PCI Express network పరికరాల కొరకు ixgbe డ్రైవర్ సరికొత్త వర్షన్‌కు నవీకరించబడెను, అది కింది విస్తరింపును జతచేయును:
    • Intel Ethernet 82599 10 గిగాబైట ఈథర్నెట్ నియంత్రిక కొరకు తోడ్పాటు.
    • Intel Ethernet 82599 10 Gigabit ఈథర్నెట్ నియంత్రిక పై ఆధారపడి Quad Port 10 Gigabit ఈథర్నెట్ యెడాప్టర్‌కు తోడ్పాటు.
    • పరీక్షించని మరియు సురక్షితంకాని విస్తరిత చిన్న ఫాం-ఫాక్టర్ ప్లగ్గబుల్ (SFP+) మాడ్యూళ్ళను అనుమతించుటకు మాడ్యూల్ పారామితి (allow_unsupported_sfp)ని జతచేసెను.
  • సరికొత్త హార్డువేర్ తోడ్పాటు, విస్తరింపులు, మరియు బగ్ పరిష్కారాలను చేర్చుటకు ixgbevf డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను. అదనంగా, 100MB లింకు వేగాన్ని గుర్తించుటకు తోడ్పాటు జతచేయబడెను.
  • igbvf డ్రైవర్ అప్‌స్ట్రీమ్ వర్షన్ 2.0.1-k-1 కు నవీకరించబడెను.
  • Intel Gigabit ఈథర్నెట్ యెడాప్టర్స్ కొరకు igb డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, ఇది Intel ఈథర్నెట్ నెట్వర్కు అనుసంధానం I210 మరియు Intel ఈథర్నెట్ నెట్వర్కు అనుసంధానం I211 కొరకు తోడ్పాటు జతచేయును.
  • Intel 82563/6/7, 82571/2/3/4/7/8/9, మరియు 82583 PCI-E కుటుంబపు నియంత్రికల కొరకు e1000e డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, అది Intel ఈథర్నెట్ నెట్వర్కు అనుసంధానం I217-LM కొరకు తోడ్పాటు కలిగివుండును.
  • bna డ్రైవర్ సాంకేతిక ముందస్తుదర్శనం వలె పరిగణించబడదు. Red Hat Enterprise Linux 5.9 నందు, BNA డ్రైవర్ పూర్తిగా తోడ్పాటునీయబడును. అదనంగా, BNA డ్రైవర్ మరియు ఫర్మువేర్ అనునవి వర్షన్ 3.0.23.0 కు నవీకరించబడెను.
  • qlge డ్రైవర్ అనునది వర్షన్ 1.00.00.30 కు నవీకరించబడెను.
  • qlcnic డ్రైవర్ అనునది HP NC-Series QLogic 10 Gigabit సర్వర్ యెడాప్టర్స్ కొరకు వర్షన్ 5.0.29 కు నవీకరించబడెను.
  • ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరముల కొరకు be2net డ్రైవర్ వర్షన్ 4.2.116r కు నవీకరించబడెను
  • enic డ్రైవర్ అనునది Cisco 10G ఈథర్నెట్ పరికరాల కొరకు వర్షన్ 2.1.1.35+ కు నవీకరించబడెను.

3.3. నానారకములైన డ్రైవర్లు

  • mlx4 ib మరియు net డ్రైవర్లు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను. అదనంగా, EEH దోష దిద్దుబాటు కొరకు తోడ్పాటు mlx4 డ్రైవర్‌కు జతచేయబడెను.
  • mlx4_en డ్రైవర్ వర్షన్ 1.5.3 కు నవీకరించబడెను.
  • mlx4_core డ్రైవర్ వర్షన్ 1.0-ofed1.5.4 కు నవీకరించబడెను.
  • కొత్త చిప్‌సెట్స్ మరియు HDA ఆడియో కోడెక్స్ కొరకు తోడ్పాటును చేతనం చేయుటకు మరియు మెరుగుపరచుటకు ALSA HDA ఆడియో డ్రైవర్ నవీకరించబడెను.
  • IPMI డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.

అధ్యాయము 4. ఫైల్ సిస్టమ్ మరియు నిల్వ నిర్వహణ

dmraid కొరకు FIPS రీతి తోడ్పాటు
dmraid root పరికరాలతో Red Hat Enterprise Linux 5.9 అనునది FIPS రీతిని జతచేయుటకు తోడ్పాటును జతచేయును. FIPS చెక్‌సమ్ పరిశీలించుటకు ముందుగానే dmraid పరికరం క్రియాశీలపరచబడును.

అధ్యాయము 5. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ

RHN క్లాసిక్ నుండి సబ్‌స్క్రిప్షన్ యెసెట్ నిర్వాహికకు మైగ్రేషన్
Red Hat Enterprise Linux 5.9 నందు, వాడుకరులు RHN క్లాసిక్ నుండి Red Hat సబ్‌స్క్రిప్షన్ యెసెట్ మేనేజర్‌ (SAM)కు మైగ్రేట్ కాగలరు. క్లైంట్ మిషన్ల నందు సబ్‌స్క్రిప్షన్ సమాచారం మరియు సాఫ్టువేర్ నవీకరణలను సంభాలించుటకు SAM ప్రోక్సీ వలె వ్యవహరించును. మైగ్రేషన్ ప్రోసెస్‌పై మరింత సమాచారం కొరకు, Subscription Management Guide చూడండి.

బహిర్గత సేవికలకు వ్యతిరేకంగా నమోదుచేయుట
వ్యవస్థ యొక్క నమోదీకరణ నందు దూరస్థ సేవిక యెంపికకు తోడ్పాటు అనేది యిప్పుడు సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక చేత తోడ్పాటు యీయబడుతోంది. నమోదీకరణ కార్యక్రమంనందు, పోర్ట్ మరియు ప్రిఫిక్స్ తో కలిపి, సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక వాడుకరి యింటర్ఫేస్ నమోదు అవ్వుటకు సేవిక URL యెంచుకొనే ఐచ్చికాన్ని అందించును. అదనంగా, ఆదేశ వరుసనందు నమోదగునప్పుడు, నమోదగుటకు సేవికను తెలుపుటకు --serverurl వుపయోగించగలం. ఈ విశేషణం గురించి అదనపు సమాచారం కొరకు, Subscription Management Guide చూడండి.

ఫస్ట్‌బుట్ వ్యవస్థ నమోదీకరణ
Red Hat Enterprise Linux 5.9 నందు, firstboot వ్యవస్థ నమోదీకరణ అప్పుడు, Red Hat సబ్‌స్క్రిప్షన్ నిర్వహణకు నమోదగుట యిప్పుడు అప్రమేయ ఐచ్చికం.

సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక gpgcheck ప్రవర్తన
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక నిర్వహించు యే రిపోజిటరీలైనా ఖాళీ gpgkey కలిగివుంటే అది gpgcheckను అచేతనం చేయును. రిపోజిటరీను తిరిగి-చేతనం చేయుటకు, GPG కీలను అప్‌లోడ్ చేసి, మీ వినియోగదారి కాంటెంట్ నిర్వచనంకు సరైన URL జతచేయునట్లు చూసుకోండి.

సేవిక-వైపు తొలగింపులు
వినియోగదారి పోర్టల్ నుండి తొలగించగానే వ్యవస్థ ప్రొఫైల్స్ నమోదీకరణ తీసివేయబడును అలా అవి ధృవీకరణపత్ర-ఆధారిత RHN తో చెకిన్ కాలేవు.

అభీష్ట సేవా స్థాయిలు
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక అనునది యిప్పుడు వాడుకరులను ఆటో-సబ్‌స్క్రైబ్ మరియు హీలింగ్ లాజిక్‌ను ప్రభావితం చేసే అభీష్ట సేవా స్థాయితో మిషన్‌ను కలుపుటకు అనుమతించును. సేవాస్థాయిలపై మరింత సమాచారం కొరకు, Subscription Management Guide చూడండి.

ఫలానా చిన్న విడుదలకు నవీకరణలను పరిమితం చేయుచున్నది
సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక యిప్పుడు వాడుకరిని ఫలానా విడుదల (ఉదాహరణకు, Red Hat Enterprise Linux 5.8)ను యెంచుకొనుటకు అనుమతించును, అది మిషన్‌ను విడుదలకు లాక్ చేయును. ఈ నవీకరణకు ముందు, చిన్న విడుదల (ఉదాహరణకు, Red Hat Enterprise Linux 5.9) నందు భాగముగా అందుబాటులో వుండే కొత్త ప్యాకేజీల ప్యాకేజీ నవీకరణలను పరిమితం చేసే అవకాశంలేదు.

GUI నందు వాడుక మార్పులు
వినియోగదారి స్పందనపై ఆధారపడి వివిధ మార్పులతో సబ్‌స్క్రిప్షన్ నిర్వాహిక గ్రాఫికల్ యూజర్ యింటర్ఫేస్ వృద్దిచేయబడెను.

అధ్యాయము 6. రక్షణ మరియు ధృవీకరణ

pam_cracklib కొరకు అదనపు సంకేతపద పరిశీలనలు
maxclassrepeat మరియు gecoscheck ఐచ్చికాల కొరకు Red Hat Enterprise Linux 5.9 pam_cracklib మాడ్యూల్‌కు బ్యాక్‌పోర్టెడ్ తోడ్పాటును జతచేయును. వాడుకరి చేత ప్రవేశపెట్టిన కొత్త సంకేతపదం లక్షణాలను పరిశీలించుటకు వొకవేళ అవి తెలిపిన పరిమితులకు సరితూగక పోతే తిరస్కరించుటకు ఈ ఐచ్చికాలు వుపయోగించబడుతాయి. ఒకే కారెక్టర్ క్లాస్ (లోవర్ కేస్, అప్పర్ కేస్, అంకెలు, మరియు యితర అక్షరాలు) యొక్క వరుస అక్షరాల గరిష్ట సంఖ్యను maxclassrepeat ఐచ్చికం పరిమితం చేయును. వాడుకరి సంకేతపదం ప్రవేశం /etc/passwd నందు GECOS క్షేత్రమునుండి (స్పేస్‌తో-వేరుచేసిన స్ట్రింగ్స్) పదాలను కొత్తగా-ప్రవేశపెట్టిన సంకేతపదం కలిగివున్నదేమో gecoscheck ఐచ్చికం పరిశీలించును. మరింత సమాచారం కొరకు, pam_cracklib(8) man పేజీ చూడండి.

M2Crypto కొరకు IPv6 తోడ్పాటు
పైథాన్ స్క్రిప్ట్స్ నుండి పోగ్రామ్స్ OpenSSL ఫంక్షన్సును కాల్ చేయుటకు అనుమతించే లైబ్రరీను అందించు, m2crypto ప్యాకేజీ అనునది, HTTPS యింప్లిమెంటేషన్ IPv4 మరియు IPv6 తో పనిచేయునట్లు సవరించుటకు నవీకరించబడెను. అదనంగా, M2Crypto.SSL.Connection ఆబ్జక్టు అనునది IPv6 సాకెట్లను సృష్టించుటకు సూచించబడెను.

sudoers ప్రవేశాలనందలి లుకప్స్ నందు సరిజోడీలను అధికారికంగా పరిగణిస్తోంది
sudoers ప్రవేశాల కొరకు sudo సౌలభ్యం /etc/nsswitch.conf ఫైలు సంప్రదించగలదు మరియు వాటిని ఫైళ్ళ నందు లేదా LDAP నందు చూడగలదు. గతంలో, sudoers ప్రవేశాల డాటాబేస్ నందు సరిజోడీ కనుగొనినా, లుకప్ ఆపరేషన్ యింకా యితర డాటాబేస్‌లనందు (ఫైళ్ళతో సహా) కొనసాగుతూవుండేది. Red Hat Enterprise Linux 5.9 నందు, sudoers ప్రవేశపు సరిజోడీ తరువాత సరిపోయే డాటాబేస్ తెలుపుటకు, /etc/nsswitch.conf ఫైలుకు వొక ఐచ్చికం జతచేయబడెను. ఇది యే యితర డాటాబేస్‌లనైనా ప్రశ్నించు అవసరాన్ని తొలగించినది; అలా, లార్జ్ యెన్విరాన్మెంట్స్ నందు sudoers ప్రవేశపు లుకప్స్ పనితనాన్ని మెరుగుపరిచెను. ఈ ప్రవర్తన అప్రమేయంగా చేతనం చేయబడివుండదు, డాటాబేస్ యెంపికతరువాత [SUCCESS=return] స్ట్రింగ్ జతచేసి ఆకృతీకరించాలి. డాటాబేస్ నందు సరిజోడీ కనుగొనగానే అది నేరుగా యీ స్ట్రింగ్ ముందుంచును, యింకా యే యితర డాటాబేస్‌లు ప్రశ్నించబడవు.

అధ్యాయము 7. కంపైల్ మరియు సాధనాలు

సిస్టమ్‌టాప్
ఆపరేటింగ్ సిస్టమ్ (ప్రత్యేకించి, కెర్నల్) ను విశదీకృతంగా అధ్యయనం చేసి పర్యవేక్షించుటకు SystemTap అనునది ట్రేసింగ్ మరియు ప్రోబింగ్ సాధనం. ఇది netstat, ps, top, మరియు iostat; వంటి సాధనములకు సమానమైన అవుట్‌పుట్ యిచ్చును. సేకరించిన సమాచారంకు మరిన్ని ఫిల్టరింగ్ మరియు విశ్లేషక ఐచ్చికాలను అందించుటకు SystemTap రూపొందించబడెను.

Red Hat Enterprise Linux 5.9 నందలి సిస్టమ్‌టాప్ వర్షన్ 1.8కు నవీకరించెను, కింది విశేషణాలను మరియు విస్తరింపులను అందించుచున్నది:
  • స్క్రిప్టుల నుండి లో-త్రౌపుట్ అవుట్పుట్‌ పోల్‌కు తరచు తక్కువ వేక్-అప్స్ అనుమతించుటకు సిస్టమ్‌టాప్ రన్‌టైమ్ (staprun) యిప్పుడు -T టైమ్‌అవుట్ ఐచ్చికం ఆమోదించును.
  • సిస్టమ్‌టాప్ చేత యిన్వోక్ చేయబడినప్పుడు, kbuild $PATH యెన్విరాన్మెంట్ శానిటైజ్ అయినది.
  • ముద్రించబడని అక్షరాలను తప్పించుటకు printf ఫార్మాట్స్ యిప్పుడు %#c నియంత్రణ పారామితి వుపయోగించగల సామర్థ్యం కలిగివున్నాయి.
  • ప్రెట్టీ-ప్రింటెడ్ బిట్ క్షేత్రములు యిప్పుడు యింటీజర్స్ వుపయోగించును; ముద్రణ కొరకు అక్షరాలు యిప్పుడు యెస్కేప్‌డ్ ఫార్మేటింగ్ వుపయోగించుచున్నవి.
  • సిస్టమ్‌టాప్ కంపైల్-సర్వర్ మరియు క్లైంట్ యిప్పుడు IPv6 నెట్వర్కులను తోడ్పాటునిచ్చుచున్నవి.
  • సిస్టమ్‌టాప్ మాడ్యూళ్ళు యిప్పుడు చిన్నవి మరియు వేగంగా కంపైల్ అగును. మాడ్యూల్ యొక్క డీబగ్‌సమాచారం యిప్పుడు అప్రమేయంగా కుదించబడును.
  • uprobe మరియు kprobe సంభాలికలు (ప్రోసెస్, కెర్నల్, మాడ్యూల్) నందు DWARF వేరియబుల్స్ యాక్సెస్ చేయుటకు @var సిన్టాక్స్ యిప్పడుు ప్రత్యామ్నాయ లాంగ్వేజ్ సిన్టాక్స్.
  • సిస్టమ్‌టాప్ స్క్రిప్ట్ ట్రాన్సులేటర్ డ్రైవర్ (stap) యిప్పుడు కింది రిసోర్స్ పరిమితి ఐచ్చికాలను అందించును:
    --rlimit-as=NUM
    --rlimit-cpu=NUM
    --rlimit-nproc=NUM
    --rlimit-stack=NUM
    --rlimit-fsize=NUM
    
  • సిస్టమ్‌టాప్ కంపైల్-సర్వర్ యిప్పుడు బహుళ సమకాలిక అనుసంధానాలకు తోడ్పాటునిచ్చును.
  • కింది టాప్‌సెట్ ప్రమేయం 1.8 విడుదల నందు ఆసివేయబడెను మరియు 1.9 విడుదలనందు తీసివేయబడెను:
    daddr_to_string()
    
  • టాప్‌సెట్స్ చేత చేర్చబడిన C హెడర్స్ తో సంఘర్షణను తప్పించుటకు సిస్టమ్‌టాప్ యిప్పుడు స్థానిక వేరియబుల్సును విచ్ఛిన్నం చేయును.
  • ఎంబెడెడ్-C ప్రమేయాలనందు, THIS->* నొటేషన్ బదులుగా కొత్తగా-నిర్వచించిన మాక్రో STAP_ARG_* యిప్పుడు వుపయోగించాలి.

అధ్యాయము 8. క్లస్టరింగ్

IBM iPDU ఫెన్స్ పరికరం కొరకు తోడ్పాటు
Red Hat Enterprise Linux 5.9 అనునది IBM iPDU ఫెన్స్ పరికరం కొరకు తోడ్పాటు జతచేస్తుంది. ఈ ఫెన్స్ పరికరం యొక్క పారామితులపై మరింత సమాచారం కొరకు, Cluster Administration మార్గదర్శిని చూడండి.

DLM హాష్ పట్టిక పరిమాణపు ట్యూనింగ్
డిస్ట్రిబ్యూటెడ్ లాక్ మేనేజర్ (DLM) యిప్పుడు DLM హాష్ పట్టిక పరిమాణాల ట్యూనింగ్ /etc/sysconfig/cman ఫైలు నుండి అనుమతించును. కింది పారామితులు /etc/sysconfig/cman ఫైలు నందు అమర్చగలం:
DLM_LKBTBL_SIZE=<size_of_table>
DLM_RSBTBL_SIZE=<size_of_table>
DLM_DIRTBL_SIZE=<size_of_table>

అది, కింది ఫైళ్ళనందు విలువలను తదనుగుణంగా సవరించును:
/sys/kernel/config/dlm/cluster/lkbtbl_size
/sys/kernel/config/dlm/cluster/rsbtbl_size
/sys/kernel/config/dlm/cluster/dirtbl_size

అధ్యాయము 9. వర్చ్యులైజేషన్

Microsoft Hyper-V డ్రైవర్స్, చేర్పు, మరియు అతిథి సంస్థాపనా తోడ్పాటు
ఇంటిగ్రేటెడ్ Red Hat Enterprise Linux అతిథి సంస్థాపన, మరియు Hyper-V పారా-వర్చ్యులైజ్డ్ పరికర తోడ్పాటు Red Hat Enterprise Linux 5.9 నందు Microsoft Hyper-V పై వాడుకరులను Red Hat Enterprise Linux 5.9ను అతిథి వలె Microsoft Hyper-V హైపర్విజర్స్ పై నడుపుటకు అనుమతించును. కింది Hyper-V డ్రైవర్స్ మరియు క్లాక్ సోర్స్ అనునవి Red Hat Enterprise Linux 5.9 తో అందించబడిన కెర్నల్‌కు జతచేయబడెను:
  • నెట్వర్కు డ్రైవర్ (hv_netvsc)
  • నిల్వ డ్రైవర్ (hv_storvsc)
  • HID-కంప్లైంట్ మౌస్ డ్రైవర్ (hid_hyperv)
  • VMbus డ్రైవర్ (hv_vmbus)
  • util డ్రైవర్ (hv_util)
  • క్లాక్ సోర్స్ (i386: hyperv_clocksource, AMD64/Intel 64: HYPER-V timer)

Red Hat Enterprise Linux 5.9 అతిథి Hyper-V కీ-వాల్యూ పెయిర్ (KVP) డెమోన్ (hypervkvpd) కూడా కలిగివుంది అది ప్రాధమిక సమాచారం, అతిథి IP, FQDN, OS పేరు, మరియు OS విడుదల సంఖ్య, వంటివి అతిధేయకు VMbus ద్వారా పంపును.

అధ్యాయము 10. సాధారణ నవీకరణలు

samba3x ప్యాకేజీలను నవీకరించెను
Red Hat Enterprise Linux 5.9 అనునది రీబేస్‌డ్ samba3x ప్యాకేజీలను కలిగివుండును అది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందించును, ముఖ్యమైనది SMB2 ప్రొటోకాల్ కొరకు తోడ్పాటు జతచేయుట. /etc/samba/smb.conf ఫైలు యొక్క [global] విభాగము నందు కింది పారామితితో SMB2 తోడ్పాటు చేతనం చేయవచ్చు:
max protocol = SMB2

హెచ్చరిక

నవీకరించిన samba3x ప్యాకేజీలు ఐడి మాపింగ్ ఆకృతీకరించిన విధానంను కూడా మార్చెను. వాడుకరులు వారి సాంబా ఆకృతీకరణ ఫైళ్ళను సవరించుకోమని సూచించడమైంది. అదిక సమాచారం కొరకు, Release Notes for Samba 3.6.0 చూడండి.

OpenJDK 7
Red Hat Enterprise Linux 5.9 అనునది OpenJDK6 కు ప్రత్యామ్నాయంగా OpenJDK 7 కు పూర్తి తోడ్పాటును అందించును. java-1.7.0-openjdk ప్యాకేజీలు OpenJDK 7 జావా రన్‌టైమ్ యెన్విరాన్మెంట్ మరియు OpenJDK 7 జావా సాఫ్టువేర్ డెవలప్‌మెంట్ కిట్ అందించును. OpenJDK 7 అనునది JVM పైన నడువగలిగే డైనమికల్లీ-టైప్‌డ్ లాంగ్వేజెస్‌కు తోడ్పాటునిచ్చు విస్తరింపులను, క్లాస్ లోడర్ విస్తరింపులను, యూనికోడ్ 6.0 కు తోడ్పాటును, మరియు నవీకృత I/O మరియు నెట్వర్కింగ్ APIలను కలిగివుంది. Red Hat Enterprise Linux 6 నందు కూడా OpenJDK 7 అందుబాటులో వుంది.

కొత్త జావా 7 ప్యాకేజీలు
java-1.7.0-ibm మరియు java-1.7.0-oracle ప్యాకేజీలు యిప్పుడు Red Hat Enterprise Linux 5.9 నందు అందుబాటులో వున్నాయి.

కొత్త libitm ప్యాకేజీ
libitm అనునది GNU ట్రాన్సాక్షనల్ మెమొరీ లైబ్రరీ కలిగివుంది, ఇది చాలా త్రెడ్స్ ద్వారా షేర్డ్ మెమొరీ యాక్సెస్ సింక్రొనైజేషన్‌ను చేతనం చేయుటకు ప్రోసెస్ యొక్క మెమొరీ యాక్సెస్ కొరకు ట్రాన్సాక్షన్ తోడ్పాటు అందించును.

Rsyslog ముఖ్య వర్షన్ 5 కు నవీకరించబడెను
Red Hat Enterprise Linux 5.9 అనునది కొత్త rsyslog5 ప్యాకేజీను కలిగివుంది అది rsyslogను ముఖ్య వర్షన్ 5 కు నవీకరించును.

ముఖ్యమైన

rsyslog5 ప్యాకేజీ rsyslog ప్యాకేజీకు ప్రతిక్షేపన అది rsyslog యొక్క ముఖ్య వర్షన్ 3ను Red Hat Enterprise Linux 5 నందు అందించును. rsyslog5 ప్యాకేజీను సంస్థాపించుటకు, rsyslog ప్యాకేజీ తప్పక ముందుగా నిర్మూలించాలి.

rsyslog ను ముఖ్య వర్షన్ 5 కు నవీకరించుట ద్వారా వివిధ విస్తరింపులు మరియు వివిధ బగ్‌లకు పరిష్కారాలు యిచ్చును. కిందివి అతి ముఖ్యమైన మార్పులు:
  • $HUPisRestart డైరెక్టివ్ తీసివేయబడెను మరియు యికపై తోడ్పాటు యీయబడదు. పునఃప్రారంభ-రకం HUP ప్రోసెసింగ్ కూడా అందుబాటులో వుండదు. ఇప్పుడు, SIGHUP సంకేతం స్వీకరించగానే, అవుట్‌పుట్స్(చాలా సందర్భాలలో లాగ్ ఫైళ్ళు) మాత్రమే తెరువబడును లాగ్ రోటేషన్ తోడ్పాటుకు.
  • స్పూల్ ఫైళ్ళ యొక్క ఫార్మేట్ (ఉదాహరణకు, డిస్క్-ఎస్సిస్టెడ్ క్యూస్) మార్చబడెను. కొత్త ఫార్మాట్‌కు మారుటకు, స్పూల్ ఫైళ్ళను డ్రెయిన్ చేయుము, ఉదాహరణకు, rsyslogd మూసివేయుట ద్వారా. అప్పుడు, Rsyslog నవీకరణతో కొనసాగుము, మరియు rsyslogd తిరిగి ప్రారంభించుము. ఒకసారి నవీకరించిన తరువాత, కొత్త ఫార్మాట్ స్వయంచాలకంగా వుపయోగించబడును.
  • rsyslogd డెమోన్ డీబగ్ రీతినందు నడుచునప్పుడు (-d ఐచ్చికం వుపయోగించి), అది ఫోర్‌గ్రౌండ్ నందు నడుచును. ఇది పరిష్కరించబడెను మరియు డెమోన్ యిప్పుడు ఫోర్క్ చేయబడి బ్యాక్‌గ్రౌండ్ నందు నడుచును. rsyslogd స్వయంచాలకంగా బ్యాక్‌గ్రౌండ్ నందు ప్రారంభించుట నిలుపుటకు -n ఐచ్చికం వుపయోగించవచ్చునని గమనించండి.

Rsyslog యొక్క యీ వర్షన్ నందలి మార్పులపై మరింత సమాచారం కొరకు, http://www.rsyslog.com/doc/v5compatibility.html చూడండి.

పునఃపరిశీలన చరిత్ర

పునఃపరిశీలన చరిత్ర
పునఃపరిశీలన 1-0.2.3Tue Dec 11 2012Krishnababu Krothapalli
Final Build for RHEL5.9 Release Notes
పునఃపరిశీలన 1-0.2.2Tue Dec 11 2012Krishnababu Krothapalli
Red Hat Release Notes 5.9 translation for telugu
పునఃపరిశీలన 1-0.2.1Tue Dec 11 2012Chester Cheng
Translation files synchronised with XML sources 1-0.2
పునఃపరిశీలన 1-0.2Tue Dec 11 2012Martin Prpič
Red Hat Enterprise Linux 5.9 విడుదల నోట్స్ యొక్క విడుదల
పునఃపరిశీలన 1-0.1Mon Sep 24 2012Martin Prpič
Translation files synchronised with XML sources 1-0
పునఃపరిశీలన 1-0Thu Sep 20 2012Martin Prpič
Release of the Red Hat Enterprise Linux 5.9 Beta Release Notes